Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6b56328e-a533-4531-8b48-6d117c63c2c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6b56328e-a533-4531-8b48-6d117c63c2c8-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో భారీ రేంజ్ లో ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీం గా చెత్త రికార్డును మూటగట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి అదృష్టం కలిసి రాబోతుందా.. ఇక అందని ద్రాక్షలా ఉన్న టైటిల్ ను బెంగళూరు టీమ్ ముద్దాడ బోతుందా... దాదాపు 16 ఏళ్ల నుంచి ప్రేక్షకులందరూ నిరీక్షణగా ఎదురుచూస్తున్న టైటిల్ ఇక బెంగళూరు టీం వశం కాబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే క్రికెట్ విశ్లేషకులు కూడా అవును అనే సమాధానంIpl{#}Pakistan;gulf countries;Royal Challengers;Sultan;Avunu;Babur;Cricketఆర్సిబి కొత్త కోచ్ గురించి.. ఈ విషయాలు తెలుసా?ఆర్సిబి కొత్త కోచ్ గురించి.. ఈ విషయాలు తెలుసా?Ipl{#}Pakistan;gulf countries;Royal Challengers;Sultan;Avunu;Babur;CricketSat, 05 Aug 2023 12:00:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో భారీ రేంజ్ లో ప్రేక్షకాదరణ  ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీం గా చెత్త రికార్డును మూటగట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి అదృష్టం కలిసి రాబోతుందా.. ఇక అందని ద్రాక్షలా ఉన్న టైటిల్ ను బెంగళూరు టీమ్ ముద్దాడ బోతుందా... దాదాపు 16 ఏళ్ల నుంచి ప్రేక్షకులందరూ నిరీక్షణగా ఎదురుచూస్తున్న టైటిల్ ఇక బెంగళూరు టీం వశం కాబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే క్రికెట్ విశ్లేషకులు కూడా అవును అనే సమాధానం చెప్పగలుగుతున్నారు.


 ఎందుకంటే ఈసాల కప్ నందే అంటూ ప్రతిసారి కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగే బెంగళూరు టీం నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తి తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండేది. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బెంగళూరు జట్టు యాజమాన్యం జట్టులో అనూహ్యమైన మార్పులు చేసింది. కోచింగ్ సిబ్బందిని తొలగించి కొత్త కోచ్ గా అండి ఫ్లవర్ ను నియమించుకుంది. అయితే ప్రస్తుతం రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు కొత్త కోచ్ అండి ఫ్లవర్.  రికార్డులు చూస్తే మాత్రం బెంగళూరుకు టైటిల్ కొట్టాలి అనే కోరిక నెరవేరినట్లే అని అనిపిస్తుంది.



 ఎందుకంటే అండి ఫ్లవర్ అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాబర్ అజాం కెప్టెన్ గా ఉన్న ముల్తాన్ సుల్తాన్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండగా.. ఇక ఆ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఐఎల్ టి20 లీగ్ లో గల్ఫ్ జెయింట్స్ కి హెడ్ కోచ్ గా టైటిల్ గెలిపించాడు. సిపిఎల్లోనూ లూసియా విజయాల్లో కీలక పాత్ర వహించాడు. ఇలా ఇప్పటివరకు అతను koch గా వ్యవహరించిన అన్ని లీగ్లలో కూడా జట్టుకు టైటిల్ అందించిన ఘనత అండి ఫ్లవర్ ది అని చెప్పాలి. ఇక ఇప్పుడు బెంగళూరు జట్టు హెడ్ కోచ్గా వచ్చాడు. దీంతో ఈ టీం కి కూడా అందని ద్రాక్షలా ఉన్న టైటిల్ అందించబోతున్నాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>