PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-kuppam-pulivendulaa8567730-6d35-4421-9214-474f21177b97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-kuppam-pulivendulaa8567730-6d35-4421-9214-474f21177b97-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి బాగా పట్టుదలగా ఉన్నారు. అందుకు గ్రౌండ్ లెవల్లో తనవంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. జగన్ తాలూకు గ్రౌండ్ వర్క్ టెన్షన్ చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. గడచిన 35 ఏళ్ళుగా కుప్పానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏడాదికి ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తే చాలా గొప్ప. అలాంటిది 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అందరికీ తెలిసిందే. jagan chandrababu kuppam pulivendula{#}Hanu Raghavapudi;Rayalaseema;kuppam;CBN;Pulivendula;wednesday;Janasena;local language;Reddy;Yevaru;Pawan Kalyan;YCP;Jagan;Andhra Pradeshరాయలసీమ : ఎవరు సక్సెస్ అవుతారో ?రాయలసీమ : ఎవరు సక్సెస్ అవుతారో ?jagan chandrababu kuppam pulivendula{#}Hanu Raghavapudi;Rayalaseema;kuppam;CBN;Pulivendula;wednesday;Janasena;local language;Reddy;Yevaru;Pawan Kalyan;YCP;Jagan;Andhra PradeshThu, 03 Aug 2023 07:00:00 GMT



గతంలో ఎన్నడూ చూడని భిన్నమైన రాజకీయాన్ని రాబోయేఎన్నికల్లో ఏపీ జనాలు చూడబోతున్నారు. అదేమిటంటే ఇద్దరు నేతలు ఒకళ్ళని మరొకళ్ళు సంపూర్ణంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించటం.  ఏదో ఎంఎల్ఏల స్ధాయిలో  రెండు పార్టీల వాళ్ళు ప్రయ్నాలు చేసుకుంటే అదేమీ పెద్ద వార్తకాదు. కానీ ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటున్నది రెండు పార్టీల అధినేతలు కావటమే సంచలనంగా మారబోతోంది. (జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియోజకవర్గం ఇంకా డిసైడ్ కాలేదు)  ఈపాటికే ఆ పార్టీలేవి, అధినేతలు ఎవరు అన్నది అందరికీ అర్ధమైపోయుంటుంది.





రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి బాగా పట్టుదలగా ఉన్నారు. అందుకు గ్రౌండ్ లెవల్లో తనవంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. జగన్ తాలూకు గ్రౌండ్ వర్క్ టెన్షన్ చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. గడచిన 35 ఏళ్ళుగా కుప్పానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏడాదికి ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తే చాలా గొప్ప. అలాంటిది 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అందరికీ తెలిసిందే.





తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అప్పుడే జగన్ కు కుప్పంలో చంద్రబాబును ఓడించటంపై దృష్టిపడింది. అప్పటినుండే చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. అందుకనే ఇపుడు నెలకు ఒకసారి కుప్పంలో  పర్యటిస్తున్నారు. తనను టెన్షన్ కు గురిచేస్తున్న జగన్ను తాను కూడా అదే పద్దతిలో టెన్షన్ పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే రెగ్యులర్ గా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టుల టూర్లో భాగంగా బుధవారం పులివెందులలో చంద్రబాబు బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.





కుప్పంలో చంద్రబాబు ఓటమికి జగన్ ప్రయత్నిస్తుంటే పులివెందులలో జగన్ ఓటమికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు కుప్పం ఎలా కంచుకోటగా మారిందో వైఎస్ కుటుంబానికి పులివెందుల కూడా అలాంటి కంచుకోటనే చెప్పాలి. గతంలో పార్టీల అధినేతల నియోజకవర్గాలపై ప్రత్యర్ధిపార్టీ కూడా దృష్టిపెట్టింది లేదు. అందుకనే పార్టీల అధినేతలు, అగ్రనేతలంతా హ్యపీగా ఉండేవారు. కానీ జగన్ సరికొత్త రాజకీయాన్ని జనాలకు చూపించబోతున్నారు. అందుకనే ఇపుడు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత  పవన్ కల్యాణ్ లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. మరి ముగ్గురిలో ఎవరిది పైచేయవుతుందో చూడాల్సిందే. 




RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>