MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram4dbdb6cd-0012-4909-aff8-94ee0f709153-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram4dbdb6cd-0012-4909-aff8-94ee0f709153-415x250-IndiaHerald.jpg‘అల వైకుంఠ పురములో’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్ రాజమౌళి రేంజ్ కి వెళ్ళిపోతాడాని కామెంట్స్ వచ్చాయి అయితే జరిగింది వేరు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ మరో సినిమాను మొదలు పెట్టాడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. మహేష్ తో ‘గుంటూరు కారం’ మొదలుపెట్టినప్పటికీ ఆసినిమా ఆ సినిమా షూటింగ్ రకకాల కారణాలతో ఆలస్యం అవుతూ నిజంగా రాబోతున్న సంక్రాంతి రేస్ కు ఈమూవీ ఖచ్చితంగా విడుదల అవుతుందా లేదా అన్న సందేహాలు వచ్చేలా చేస్తోంది.ఇలాంటి పరిస్థితుల మధ్య త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించిన పవన్ కళ్యాణ్ ‘బ్రోTRIVIKRAM{#}trivikram srinivas;Kartha;Darsakudu;Party;Andhra Pradesh;Government;Blockbuster hit;Makar Sakranti;Director;Cinemaత్రివిక్రమ్ ను కలవరపెడుతున్ బ్రో !త్రివిక్రమ్ ను కలవరపెడుతున్ బ్రో !TRIVIKRAM{#}trivikram srinivas;Kartha;Darsakudu;Party;Andhra Pradesh;Government;Blockbuster hit;Makar Sakranti;Director;CinemaThu, 03 Aug 2023 09:00:00 GMT‘అల వైకుంఠ పురములో’  బ్లాక్ బస్టర్  హిట్ తరువాత  త్రివిక్రమ్ రాజమౌళి రేంజ్ కి  వెళ్ళిపోతాడాని కామెంట్స్ వచ్చాయి అయితే జరిగింది వేరు. ఈ మూవీ తరువాత  త్రివిక్రమ్  మరో సినిమాను మొదలు పెట్టాడానికి  3 సంవత్సరాల సమయం పట్టింది. మహేష్ తో ‘గుంటూరు కారం’  మొదలుపెట్టినప్పటికీ ఆసినిమా ఆ సినిమా షూటింగ్ రకకాల కారణాలతో ఆలస్యం అవుతూ నిజంగా రాబోతున్న సంక్రాంతి  రేస్ కు ఈమూవీ ఖచ్చితంగా విడుదల అవుతుందా లేదా అన్న సందేహాలు వచ్చేలా చేస్తోంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించిన పవన్ కళ్యాణ్
‘బ్రో’ సినిమా వివాదాలలో చిక్కుకోవడం అతడి అభిమానులను కలవర పెడుతోంది. ‘గురూజీ’ అంటూ అందరి మన్ననలు పొందిన త్రివిక్రమ్ ఇప్పుడు పొలిటికల్ గా టార్గెట్ కావడం షాకింగ్ గా మారింది. వాస్తవానికి ‘బ్రో’ సినిమాకు దర్శకుడు సముద్రఖని అయినప్పటికీ పవన్ అభిమానుల నుంచి అందరు ఈమూవీకి సంబంధించి కర్త కర్మ క్రియ త్రివిక్రమ్ అన్న భావనలో ఉన్నారు.


వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆపార్టీ అభిమానులు ఇప్పుడు త్రివిక్రమ్ అంటే మండి పడుతున్నారు. ‘బ్రో’ మూవీలో క్రియేట్ చేయబడ్డ పృధ్వీ పాత్ర ఆంధ్రప్రదేశ్ లోని ఒక మంత్రిని పోలి ఉంది అంటూ ఒక రగడ మొదలవ్వడంతో ఈ అనవసరపు రగడ లోకి పవన్ తో పాటు త్రివిక్రమ్ ను కూడ లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో . ఎన్నికలకు ఇంకా కేవలం 9 నెలల సమయం  మాత్రమే ఉంది. ఈ సమయం లోపే ‘గుంటూరు కారం’ సినిమాను విడుదలచేయవలసి ఉంది.  


సాధారణంగా టాప్ హీరోల సినిమాలు విడుదల సమయంలో ఆసినిమాల టిక్కెట్ రేట్లు బాగా పెంచుతు ఉంటారు. అయితే ఇలాంటి విషయాలకు ప్రభుత్వ అనుమతులతో పాటు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కూడ కావాలి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ విడుదల సమయంలో టిక్కెట్ రేట్ల పెంపుకు త్రివిక్రమ్ పేరు వినగానే ‘బ్రో’ వివాదం గుర్తుకు వచ్చి  అసలకు మోసం వస్తుందా అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు..  





RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>