MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevifedf2eaa-3403-4423-9d9d-b5027a72bf48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevifedf2eaa-3403-4423-9d9d-b5027a72bf48-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతూ తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకన్న తరువాత నటించిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ ఈమూడు సినిమాలు రీమేక్ లు మాత్రమే ఈసినిమాలను ఒటీటీ లలో అనేకమంది కొన్ని వందలసార్లు చూసినప్పటికీ పవన్ కు ఉన్న మ్యానియా రీత్యా ఈమూడు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆతరువాత కలక్షన్స్ విషయంలో ఈమూడు సినిమాలు చతికలపడ్డాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు ఉన్న లక్షలాది మంది వీరాభిమానుల సంఖ్యతో పోలిస్తే ఈమూవీలకు ఊహించిన స్థాయిలో కలక్షన్స్ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారchirangeevi{#}Mohanlal;Audience;U Turn;Chiranjeevi;Tollywood;Remake;kalyan;Cinemaమెగా బ్రదర్స్ రీమేక్స్ మ్యానియా !మెగా బ్రదర్స్ రీమేక్స్ మ్యానియా !chirangeevi{#}Mohanlal;Audience;U Turn;Chiranjeevi;Tollywood;Remake;kalyan;CinemaThu, 03 Aug 2023 10:00:00 GMTపవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతూ తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకన్న తరువాత నటించిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ ఈమూడు సినిమాలు రీమేక్ లు మాత్రమే ఈసినిమాలను ఒటీటీ లలో అనేకమంది కొన్ని వందలసార్లు చూసినప్పటికీ పవన్ కు ఉన్న మ్యానియా రీత్యా ఈమూడు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.



అయితే ఆతరువాత కలక్షన్స్ విషయంలో ఈమూడు సినిమాలు చతికలపడ్డాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు ఉన్న లక్షలాది మంది వీరాభిమానుల సంఖ్యతో పోలిస్తే ఈమూవీలకు ఊహించిన స్థాయిలో కలక్షన్స్ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘బ్రో’ మూవీ విడుదలై 5 రోజులు గడిచినప్పటికీ ఈమూవీకి ఇంకా 100 కోట్ల నెట్ కలక్షన్స్ అందుకోక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.



వాస్తవానికి పవన్ కళ్యాణ్ కెరియర్ తొలిరోజులలో నటించిన ‘సుస్వాగతం’ ‘ఖుషీ’ లాంటి సినిమాలు రీమేక్ అయినప్పటికీ ఆసినిమాలు అప్పట్లో సూపర్ హిట్ ను అందుకున్నాయి. అయితే ఆతరువాత పవన్ నుంచి రీమేక్ లు కాకుండా ఒరిజనల్ మూవీలను సగటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఒరిజనల్ మూవీలో పవన్ ను చూడాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం రీమేక్ లకు ఓటు వేస్తూ ఉండటంతో పవన్ కలక్షన్స్ స్టామినాకు సరిపోయే సినిమాలు పవన్ నుంచి రావడంలేదు అన్న అభిప్రాయాలు చాలమందిలో వ్యక్తం అవుతోంది.



ఇదేపరిస్థితి చిరంజీవి విషయంలో కూడ కొనసాగుతోందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మోహన్ లాల్ నటించిన ‘లూసీఫర్’ మళయాళ చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆసినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ రీమేక్ చేస్తే చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ఆమూవీకి కలక్షన్స్ రాలేదు అన్నది వాస్తవం. అయితే ఆతరువాత చిరంజీవి గత సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’ గా వస్తే ఆసినిమాకు 130 కోట్ల కలక్షన్స్ వచ్చాయి అన్నప్రచారం  జరిగింది. అయితే ఆహిట్ కు కొనసాగింపుగా చిరంజీవి ఇదే నెలలో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘వేదాళం’ రీమేక్ ను నమ్ముకుని ‘భోళాశంకర్’ గా వస్తున్నప్పటికీ ఈమూవీ పై సగటు ప్రేక్షకులలో పెద్దగా మ్యానియా లేదు అన్నప్రచారం జరుగుతొంది. దీనితో మెగా బ్రదర్స్ కు రీమేక్ ల కంటే ఒరిజనల్ సినిమాలు బాగా కలిసివస్తాయ అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..





RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>