PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kurnool-tdpe2fe7574-703e-4536-b264-0eb7f925e6b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kurnool-tdpe2fe7574-703e-4536-b264-0eb7f925e6b1-415x250-IndiaHerald.jpgఅక్కడ కూడా సేమ్ టు సేమ్. నందికొట్కూరులో రోడ్డుషో పర్వాలేదన్నట్లుగా జరిగింది. అకకడినుండి ముచ్చుమర్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారు 4 గంటల ప్రాంతంలో ముచ్చుమర్రికి చేరుకున్న చంద్రబాబుకు రోడ్డుమీద ఎవరూ కనిపించలేదు. దాదాపు కిలోమీటర్ దూరం రోడ్డు షో చేస్తే ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా కనబడలేదు. రోడ్లో జనాలు కూడా చంద్రబాబును పట్టించుకోలేదు. ఓపెన్ టాప్ జీపులో నిలబడి జనాలందరికీ అభివాదం చేస్తు జనాలు లేని రోడ్లపైన చంద్రబాబు ప్రయాణించటమే ఆశ్చర్యంగా ఉంది. chandrababu kurnool tdp{#}kadapa;Rayalaseema;Nandyala;Nandikotkur;Chittoor;CBN;Electionsరాయలసీమ : చంద్రబాబుకు ఎంత అవమానంరాయలసీమ : చంద్రబాబుకు ఎంత అవమానంchandrababu kurnool tdp{#}kadapa;Rayalaseema;Nandyala;Nandikotkur;Chittoor;CBN;ElectionsThu, 03 Aug 2023 03:00:00 GMT


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడుకు తీరని అవమానం జరిగింది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు యుద్ధభేరి మోగించారు. 1వ తేదీనుండి నాలుగురోజుల పాటు వరుసగా కర్నూలు, కడప జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. తర్వాత అనంతపురం, చిత్తూరు జిలాల టూరు షెడ్యూల్ కూడా ఫైనల్ అయ్యింది. ముందుగా టూరును కర్నూలులో మొదలుపెడుతున్నారు కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గంలోని నేతలు, నంద్యాల నేతలతో మాట్లాడారు.





అనుకున్నట్లుగానే నంద్యాలతో టూరును మొదలుపెట్టారు. నంద్యాలలో రోడ్డుషో, నందికొట్కూరులో రోడ్డుషో+బహిరంగసభ రెండూ పెట్టుకున్నారు. అయితే నంద్యాల రోడ్డుషోలో జనాలే కనబడలేదు. ముచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించి చాలా హడావుడి చేయాలని చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసుకున్నారు. తీరాచూస్తే నంద్యాల రోడ్డుషోలో జనాలే కనబడలేదు. ఇలాంటి పరిస్ధితిని చంద్రబాబు ఊహించుండరు. సరే ఇక్కడినుండి నందికొట్కూరుకు వెళ్ళారు.





అక్కడ కూడా సేమ్ టు సేమ్. నందికొట్కూరులో రోడ్డుషో పర్వాలేదన్నట్లుగా జరిగింది. అకకడినుండి ముచ్చుమర్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారు 4 గంటల ప్రాంతంలో ముచ్చుమర్రికి చేరుకున్న చంద్రబాబుకు రోడ్డుమీద ఎవరూ కనిపించలేదు. దాదాపు కిలోమీటర్ దూరం రోడ్డు షో చేస్తే ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా కనబడలేదు. రోడ్లో జనాలు కూడా చంద్రబాబును పట్టించుకోలేదు. ఓపెన్ టాప్ జీపులో నిలబడి జనాలందరికీ అభివాదం చేస్తు జనాలు లేని రోడ్లపైన చంద్రబాబు ప్రయాణించటమే ఆశ్చర్యంగా ఉంది.





రోడ్డుపైన జనాలు లేనపుడు ఎవరైనా ఏమిచేస్తారంటే కూర్చునేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులూపుతు, దణ్ణాలు పెట్టుకుంటూ  ఖాళీరోడ్లమీదే వెళ్ళిపోయారు. తనకు ఇలాంటి పరిస్ధితి ఎదురవుతుందని చంద్రబాబు ఎప్పుడూ ఊహించుండరు. ప్రభుత్వంపై యుద్ధభేటి మోగించి తాను రాయలసీమ జిల్లాల పర్యటనకు వస్త ముచ్చుమర్రిలో జనాలే లేకపోవటం నిజంగా చంద్రబాబుకు తీరని అవమానమనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ముందుగానే చంద్రబాబు టూర్ షెడ్యూల్ నేతలందరికీ అందినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయోం ఏర్పాట్ల విషయంలో నేతలు పోటీలు పడతారు. కానీ ఇక్కడ నేతలంతా కూడబల్లుక్కున్నట్లుగా మాయమైపోవటమే ఆశ్చర్యంగా ఉంది.




RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>