EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rape41d9acfc-d3c1-460c-9d0a-5e470813c8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rape41d9acfc-d3c1-460c-9d0a-5e470813c8d2-415x250-IndiaHerald.jpgమధ్యప్రదేశ్ లో ఇటీవల 12 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అత్యంత పాశవికంగా నిర్బయ తరహ జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరు అతుల్ బలోలియా, రవీంద్ర కుమార్ లను అరెస్టు చేసింది. అయితే చట్టంలో ఉన్న లొసుగులతో వీరద్దరికి ఇప్పుడే శిక్ష పడకపోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాకుండా ఉత్తరప్రదేశ్ యోగి తరహాలో ఆలోచించింది. నిందితుల ఇద్దరి ఇంటిని అక్రమంగా నిర్మించారని కూల్చేశారు. నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చి వేత ప్రారంభించారు. నిందితుల తల్లిదండ్రులు, rape{#}yogi;Kollu Ravindra;Governmentరేప్‌ చేసిన వాళ్లకు అక్కడ అప్పటికప్పుడే శిక్ష?రేప్‌ చేసిన వాళ్లకు అక్కడ అప్పటికప్పుడే శిక్ష?rape{#}yogi;Kollu Ravindra;GovernmentThu, 03 Aug 2023 05:00:00 GMTమధ్యప్రదేశ్ లో ఇటీవల 12 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అత్యంత పాశవికంగా నిర్బయ తరహ జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరు అతుల్ బలోలియా, రవీంద్ర కుమార్ లను అరెస్టు చేసింది. అయితే చట్టంలో ఉన్న లొసుగులతో వీరద్దరికి ఇప్పుడే శిక్ష పడకపోవచ్చు. కానీ  రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాకుండా ఉత్తరప్రదేశ్ యోగి తరహాలో ఆలోచించింది.


నిందితుల ఇద్దరి ఇంటిని అక్రమంగా నిర్మించారని కూల్చేశారు. నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చి వేత ప్రారంభించారు. నిందితుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేడుకున్నా కూడా విడిచి పెట్టలేదు. అయితే ప్రభుత్వం అనుకుంటే ఏదో విధంగా ఇళ్లను కూల్చేయవచ్చు. ఎక్కడో ఓ చోట తప్పును చూపించి పని చేసేయవచ్చు. అయితే ఢిల్లీలో నిర్బయ కేసులో జరిగిన ఘటన లాగే జరగడంతో ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


మధ్య ప్రదేశ్ సర్కారు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా బుల్డోజర్ తో నిందితుల ఇంటిని కూల్చేశారు. దీంతో ప్రభుత్వం తీరుపై ఒక వైపు విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చాలా మంచి పని చేశారని చెబుతున్నారు. అయితే మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం అనేది చాలా దారుణమైన అంశం. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకురావాలి. అయితే ఇక్కడే కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.


అక్రమ సంబంధాల విషయంలో పట్టు బడిన సమయంలో కొంతమంది మహిళలు, పురుషులపై కేసులు అక్రమంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది కఠిన చట్టాలు అమలు చేయడంలో అడ్డంకిగా మారుతోంది. దీంతో కొంతమంది దుర్మార్గులు అత్యాచారం చేసినపుడు వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం కావాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వాలు మహిళలపై, బాలికలపై ఎలాంటి అఘాయీత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రజలు కోరుతున్నారు.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>