Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikae0f5734-efa8-4bac-b4fd-47c60b07912b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikae0f5734-efa8-4bac-b4fd-47c60b07912b-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనె రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ద్వైపాక్షిక సిరీస్లలో భాగంగా విదేశీ ఆటగాళ్లు భారత పర్యటనకు వచ్చినప్పుడు వారికి సకల సౌకర్యాలు కల్పించడంలో బీసీసీఐ ఎప్పుడు ముందుంటుంది. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. అయితే భారత ఆటగాళ్లు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రం ఇక ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితుల దృశ్య బీసీసీఐHardik{#}Cricket;Hardik Pandya;India;West Indies;BCCI;mediaవెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై.. హార్థిక్ పాండ్య అసహనం?వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై.. హార్థిక్ పాండ్య అసహనం?Hardik{#}Cricket;Hardik Pandya;India;West Indies;BCCI;mediaThu, 03 Aug 2023 07:24:00 GMTప్రపంచంలోనె రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ద్వైపాక్షిక సిరీస్లలో భాగంగా విదేశీ ఆటగాళ్లు భారత పర్యటనకు వచ్చినప్పుడు వారికి సకల సౌకర్యాలు కల్పించడంలో బీసీసీఐ ఎప్పుడు ముందుంటుంది. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. అయితే భారత ఆటగాళ్లు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రం ఇక ఆ దేశ  క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితుల దృశ్య బీసీసీఐ లాగా లగ్జరీ సౌకర్యాలు కల్పించలేదు.


 విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో కొన్ని కొన్ని సార్లు అటు భారత ప్లేయర్లు ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించడం లేదంటే మీడియా  సమావేశంలో ముక్కుసూటిగా చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు ప్లేయర్లు. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ముగించుకుంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ను వారి సొంత గడ్డపైనే ఓడించి రెండు సిరీస్ లను కూడా కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 అయితే ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేసాడు. వెస్టిండీస్ టూర్ లో మా జట్టు సభ్యులు అసౌకర్యానికి లోనయ్యారు. ట్రావెలింగ్ విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.  మేము ఎలాంటి లగ్జరీలు అడగడం లేదు. కానీ కొన్ని ప్రాథమిక సౌకర్యాలు కావాలి. మరోసారి వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు పరిస్థితులను మెరుగు చేయాలి అంటూ కోరాడు పాండ్య. కాగా ఇప్పటికే రెండు సిరీస్ లు ముగించుకున్న టీమిండియా నేటి నుంచి హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగుతూ టి20 సిరీస్ ఆడబోతుంది.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>