EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganfed2be56-6708-4838-affc-d451b4caf816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganfed2be56-6708-4838-affc-d451b4caf816-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో లెక్చరర్ల వయసు 62 నుంచి 65కు పెంచారు. దీన్ని మీడియాలో అధ్యాపకులకు శుభవార్త పదవీ విరమణ వయసు పెంచారని పదే పదే వార్తలు ఇస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రభుత్వం అధ్యాపకులను తగిన న్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు. గతంలో 58 ఉన్న పదవీ విరమణ వయసు 60, 62 గా మార్చి ఇప్పుడు 65 గా మార్చడంతో మొత్తం మీద ఇప్పుడు లెక్చరర్ల పదవీ విరమణ వయసు 65కు చేరింది. ఎందుకు పదవీ విరమణ వయసు పెంచుతున్నారంటే దీని వెనక అసలు రహస్యం ఉంది. అయితే వారు రిటర్మైంట్ అయితే వారికి లక్షల్లో ప్రభుత్వం డJAGAN{#}March;job;Party;Government;Newsజగనన్న నిర్ణయం.. వరం కాదు.. శాపం?జగనన్న నిర్ణయం.. వరం కాదు.. శాపం?JAGAN{#}March;job;Party;Government;NewsThu, 03 Aug 2023 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో లెక్చరర్ల వయసు 62 నుంచి 65కు పెంచారు. దీన్ని మీడియాలో అధ్యాపకులకు శుభవార్త పదవీ విరమణ వయసు పెంచారని పదే పదే వార్తలు ఇస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రభుత్వం అధ్యాపకులను తగిన న్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు. గతంలో 58 ఉన్న పదవీ విరమణ వయసు 60, 62 గా మార్చి ఇప్పుడు 65 గా మార్చడంతో మొత్తం మీద ఇప్పుడు లెక్చరర్ల పదవీ విరమణ వయసు 65కు చేరింది.


ఎందుకు పదవీ విరమణ వయసు పెంచుతున్నారంటే దీని వెనక అసలు రహస్యం ఉంది. అయితే వారు రిటర్మైంట్ అయితే వారికి లక్షల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు 50 నుంచి 60 లక్షలు ఇవ్వాలి. దాదాపు ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వారందరికి పాత పెన్షన్ విధానమే వర్తిస్తుంది. పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బోలెడంతా డబ్బులు ప్రభుత్వం రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వయసు పెంచేస్తే ఇప్పుడు మూడేళ్ల దాకా ఆ బాధ తప్పుతుంది.


ఇక్కడొక విషయం తెలుసుకోవాలి. దాదాపు పదవీ విరమణ వయసు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగి పని చేయాలని భావించడు. రిటైర్డ్ లైఫ్ ని సాఫీగా సాగిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. సడెన్ గా మూడేళ్లు మళ్లీ ఉద్యోగం చేయమంటే ఓపిక లేదని చాలా మంది చెప్పే వారు ఉంటున్నారు. ఓపిక ఉన్నా లేకున్నా పాఠాలు చెప్పినా చెప్పకున్నా వారికి మూడేళ్ల పాటు జీతం రావాల్సిందే. రిటైర్డ్ అవ్వడానికి కుదరదు.


దీని వల్ల విద్యార్థులకు కూడా నష్టమే. అటు అధ్యాపకులు కూడా పాఠాలు చెప్పలేక, అలసిపోయి ఎప్పుడు రిటైర్డ్ అవుదామని చూస్తుంటే బలవంతంగా కూర్చొబెట్టి పాఠాలు చెప్పమంటే ఏ విధంగా సాధ్యపడుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మూడేళ్ల తర్వాత కూడా ఇంకా పెంచుతారా .. అప్పుడేంటీ పరిస్థితి చూడాలి.





RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>