PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayapati-ed-tdp642d37f4-d36d-472b-88d1-95839eb9d724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayapati-ed-tdp642d37f4-d36d-472b-88d1-95839eb9d724-415x250-IndiaHerald.jpgఅలా తీసుకున్న అప్పులను సొంత ఆస్తులు డెవలప్ చేయటానికి, షెల్ కంపెనీలు ఏర్పాటుకు, వాడుకున్నట్లు గతంలోనే సీబీఐ కేసులు నమోదుచేసింది. తాజా దాడుల్లో మరిన్ని ఆధారాలు దొరకటంతో ఈడీ మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదుచేసింది. మనీల్యాండరింగ్ కేసంటే చిన్న విషయం కాదు. ఈ కేసును ఈడీ, సీబీఐ కోర్టులో ప్రవేశపెడితే రాయపాటి తొందరలోనే అరెస్టయ్యే అవకాశముంది. ఇకపుడు అందులో నుండి బయటపడటం చాలా కష్టమనే చెప్పాలి. rayapati Ed tdp{#}CBI;TDP;Sujana Choudary;Rayapati Sambasivarao;tuesday;CM;Newsఅమరావతి : మాజీ ఎంపీపై మనీల్యాండరింగ్ కేసుఅమరావతి : మాజీ ఎంపీపై మనీల్యాండరింగ్ కేసుrayapati Ed tdp{#}CBI;TDP;Sujana Choudary;Rayapati Sambasivarao;tuesday;CM;NewsThu, 03 Aug 2023 09:00:00 GMT


మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నుండి రాత్రివరకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాయపాటికి చెందిన ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేసింది. అలాగే రాయపాటి కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆపీసులు, ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు దొరికినట్లు సమాచారం. వివిధ ప్రాజెక్టుల పేరుతో రాయపాటి 13 బ్యాంకుల నుండి రు. 9,343 కోట్లు అప్పులు తీసుకున్నారు.





అలా తీసుకున్న అప్పులను సొంత ఆస్తులు డెవలప్ చేయటానికి, షెల్ కంపెనీలు ఏర్పాటుకు, వాడుకున్నట్లు గతంలోనే సీబీఐ కేసులు నమోదుచేసింది. తాజా దాడుల్లో మరిన్ని ఆధారాలు దొరకటంతో ఈడీ మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదుచేసింది. మనీల్యాండరింగ్ కేసంటే చిన్న విషయం కాదు. ఈ కేసును ఈడీ, సీబీఐ కోర్టులో ప్రవేశపెడితే రాయపాటి తొందరలోనే అరెస్టయ్యే అవకాశముంది. ఇకపుడు అందులో నుండి బయటపడటం చాలా కష్టమనే చెప్పాలి.





ఏదో కంపెనీ పెట్టడం, బ్యాంకుల నుండి వేలకోట్లరూపాయలు అప్పులు తీసుకోవటం తర్వాత దారి మళ్ళించేయటం ఎక్కువగా జరుగుతోంది. వ్యాపారాస్తులు, పారిశ్రామికవేత్తలు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశించారో అప్పటినుండే బ్యాంకుల్లో వేల కోట్లరూపాయలు అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం పెరిగిపోయింది. ఇప్పటికే ఇలాంటి కేసులను సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, రఘురామకృష్ణంరాజు లాంటి అనేకమంది ఎదుర్కొంటున్నారు. మోహిల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయామాల్యా లాంటి వాళ్ళు వేలాది కోట్లరూపాయలను ఎగ్గొట్టి ఏకంగా దేశం వదిలే పారిపోయారు.





రాజకీయాలు-పారిశ్రామికవేత్తలు కలిసిపోవటంతోనే లక్షల కోట్లరూపాయల ప్రజాధనం బ్యాంకుల రూపంలో ఆవిరైపోతోంది. ఇపుడు రాయపాటి విషయమే చూస్తే ఆయన కొంతకాలంగా టీడీపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తొందరలోనే వైసీపీలో చేరాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కుటుంబంలో కొన్ని టికెట్లను బేరమాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాయపాటి బేరాలు వైసీపీలో చెల్లే అవకాశాలు లేవు. ఇంతలోనే ఇడీ దాడులు జరగటం కలకలం రేగింది. నిజానికి ఇలాంటి దాడులు రాయపాటికి కొత్తేమీకాదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. 




RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>