PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-supreme-court-manipur42110753-8344-4cae-90ce-0baa4d4f9089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-supreme-court-manipur42110753-8344-4cae-90ce-0baa4d4f9089-415x250-IndiaHerald.jpgఅవేమిటంటే వచ్చిన కేసులను పోలీసులు వర్గీకరించారా ? ఎన్ని జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి ? జీరో ఎఫ్ఐఆర్ లలో ఎన్ని సంబంధిత పోలీసుస్టేషన్లకు బదిలీ అయ్యాయి ? ఇప్పటివరకు పోలీసులు ఎంతమందిని అరెస్టుచేశారు ? అల్లర్లకు ఎంతమందిని బాధ్యులుగా గుర్తించారు ? అరెస్టయిన నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారా ? సెక్షన్ 164 కింద పోలీసులు ఎంతమంది వాంగ్మూలాలను నమోదుచేశారు ? అని సుప్రింకోర్టు ప్రశ్నించింది. నిజానికి సుప్రింకోర్టు వేసిన ప్రశ్నలన్నీ పోలీసులు రొటీన్ గా చేయాల్సిన పనులే. modi supreme court manipur{#}Kapil Sibal;Government;police;zeroఢిల్లీ : కేంద్రానికి సుప్రిం షాకింగ్ ఆదేశాలుఢిల్లీ : కేంద్రానికి సుప్రిం షాకింగ్ ఆదేశాలుmodi supreme court manipur{#}Kapil Sibal;Government;police;zeroWed, 02 Aug 2023 05:00:00 GMT


మణిపూర్ అల్లర్లకు సంబంధించి సుప్రింకోర్టు తీవ్రంగా మండిపోయింది. అల్లర్లపై సుమోటోగా కేసులను టేకప్ చేసిన సుప్రింకోర్టు సమాధానం చెప్పటానికి కేంద్రప్రభుత్వానికి 24 గంటలు టైం ఇచ్చింది. గడువులోగా తమకు సమాధానం చెప్పితీరాల్సిందే అని స్పష్టంగా ఆదేశించింది. అల్లర్లపై సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆరు ప్రశ్నలు వేసింది. వీటికి వెంటనే సమాధానం చెప్పితీరాల్సిందే అని చెప్పింది. రెండున్నర నెలలుగా మణిపూర్లో అల్లర్లు కంట్రోల్ కాకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది.





ఘటనలను కంట్రోల్ చేయటంలో వైఫల్యం చెందటంపై మణిపూర్ పోలీసులపై సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మణిపూర్ అల్లర్లలో ఎక్కువభాగం పోలీసుల ఫెయిల్యూరే కనబడుతోందని వ్యాఖ్యానించింది. జరిగిన, జరుగుతున్న ఘటనలపై పోలీసులు బాధితులిచ్చిన ఫిర్యాదులను కూడా తీసుకోవటంలేదని, ఎఫ్ఐఆర్ లు కట్టడానికి కూడా 15 రోజుల గడువు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీసింది. కేంద్రానికి సుప్రింకోర్టు సంధించిన ప్రశ్నలు కూడా తీవ్రంగానే ఉన్నాయి.





అవేమిటంటే వచ్చిన కేసులను పోలీసులు వర్గీకరించారా ? ఎన్ని జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి ? జీరో ఎఫ్ఐఆర్ లలో ఎన్ని సంబంధిత పోలీసుస్టేషన్లకు బదిలీ అయ్యాయి ? ఇప్పటివరకు పోలీసులు ఎంతమందిని అరెస్టుచేశారు ? అల్లర్లకు ఎంతమందిని బాధ్యులుగా గుర్తించారు ? అరెస్టయిన నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారా ? సెక్షన్ 164 కింద పోలీసులు ఎంతమంది వాంగ్మూలాలను నమోదుచేశారు ?  అని సుప్రింకోర్టు ప్రశ్నించింది. నిజానికి సుప్రింకోర్టు వేసిన ప్రశ్నలన్నీ పోలీసులు రొటీన్ గా చేయాల్సిన పనులే.





విచిత్రం ఏమిటంటే అల్లర్లపై నమోదైన కేసుల లెక్కలు చెప్పటానికి ప్రభుత్వం దగ్గర వివరాలు లేవు. కొన్నివందల మంది బాధితులు పోలీసుస్టేషన్లను ఆశ్రయించినా పోలీసులు ఎవరి దగ్గర నుండి ఫిర్యాదులను తీసుకోలేదు. అల్లరిమూకలు వచ్చి ఇళ్ళమీద పడుతున్నాయని బాధితులు ఎంత గోలచేసినా పోలీసులు పట్టించుకోలేదన్న విషయం బయటపడుతున్నది. అల్లర్లు మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు నమోదైన 6 వేల ఎఫ్ఐఆర్ లలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు ఎన్ని అని సుప్రింకోర్టు ప్రశ్నకు సమాధానం దొరకలేదు. నమోదైన ఎఫ్ఐఆర్ లు 6 వేలైతే నమోదుకానివి అంతకు రెండురెట్లుంటాయని బాధితుల తరపున లాయర్ కపిల్ సిబల్ వివరించారు. మరి డెబ్ లైన్ ప్రకారం కేంద్రం ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.




RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>