DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/metroe358ed5c-f60f-4c74-8471-b42371698bb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/metroe358ed5c-f60f-4c74-8471-b42371698bb7-415x250-IndiaHerald.jpgభవిష్యత్ లో ఓ.ఆర్.ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి చెబుతున్నారు. ఓ.ఆర్.ఆర్ మెట్రోను నాలుగు కారిడార్ లుగా విభజించారు. ఓ.ఆర్.ఆర్ శంషాబాద్ జంక్షన్- తుక్కుగూడ జంక్షన్-బొంగులూరు జంక్షన్ - పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్లలో 5 స్టేషన్ లు ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.5,600ల కోట్లు ఖర్చవుతాయి. ఇక ఓ.ఆర్.ఆర్ పెద్ద అంబర్ పేట జంక్షన్-ఘట్ కేసర్ జంక్షన్-షామీర్ పేట్ జంక్షన్-మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లలలో 5 స్టేషన్ లు వస్తాయి. ఈ కారిడMETRO{#}ram pothineni;Kokapeta;Medchal;Shamshabad;Petta;Uppal;Rail;CM;Populationహైదరాబాద్‌ మెట్రో కలలు.. ఎప్పటికి పూర్తయ్యేనో?హైదరాబాద్‌ మెట్రో కలలు.. ఎప్పటికి పూర్తయ్యేనో?METRO{#}ram pothineni;Kokapeta;Medchal;Shamshabad;Petta;Uppal;Rail;CM;PopulationWed, 02 Aug 2023 23:00:00 GMTభవిష్యత్ లో ఓ.ఆర్.ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి చెబుతున్నారు.  ఓ.ఆర్.ఆర్ మెట్రోను నాలుగు కారిడార్ లుగా విభజించారు. ఓ.ఆర్.ఆర్ శంషాబాద్ జంక్షన్- తుక్కుగూడ జంక్షన్-బొంగులూరు జంక్షన్ - పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్లలో 5 స్టేషన్ లు ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.5,600ల కోట్లు ఖర్చవుతాయి.


ఇక ఓ.ఆర్.ఆర్ పెద్ద అంబర్ పేట జంక్షన్-ఘట్ కేసర్ జంక్షన్-షామీర్ పేట్ జంక్షన్-మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లలలో 5 స్టేషన్ లు వస్తాయి. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.6,750 కోట్లు ఖర్చవుతాయి. ఓ.ఆర్.ఆర్ మేడ్చల్ జంక్షన్-దుండిగల్ జంక్షన్-పటాన్ చెర్వు జంక్షన్ వరకు 29కిలోమీటర్లలో 3 స్టేషన్లు వస్తాయని.. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.4,785 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఓ.ఆర్.ఆర్ పటాన్ చెర్వు జంక్షన్- కోకాపేట జంక్షన్ -నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్లలలో 3 స్టేషన్ లు ఉంటాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3,675 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.


మొత్తం ఈ నాలుగు కారిడార్లను 136కిలోమీటర్లలో ఏర్పాటు చేస్తారు. 16 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. వీటి నిర్మాణానికి సుమారు రూ.20,810 కోట్లు అవసరం అవుతాయి. ఇక విమానాశ్రయం నుంచి ఓ.ఆర్.ఆర్ నానక్ రామ్ గూడ-శంషాబాద్ వరకు 20కిలోమీటర్లు, గచ్చిబౌలి- నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు వరకు మరో 2 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కోటికిపైగా జనాభా నివస్తున్నారని... మరో కోటి జనాభాకు సరిపోయేలా మెట్రోను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.


పటాన్ చెర్వు నుంచి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు, మేడ్చల్ జంక్షన్ నుంచి పటాన్ చెర్వు వరకు 29 కిలోమీటర్లు, పటాన్ చెర్వు నుంచి నార్సింగ్ వరకు 22కిలోమీటర్లు, శంషాబాద్ నుంచి షాద్ నగర్, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు 25కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. జే.బీ.ఎస్ నుంచి తుంకుంట వరకు, జే.బీ.ఎస్ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ పైవంతెన, మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కలలన్నీ బాగానే ఉన్నయి. మరి ఎప్పటికి సాకారం అవుతాయో?



RRR Telugu Movie Review Rating

ఆ కారణంతో విడిపోయిన హీరోయిన్ కళ్యాణి -సూర్యకిరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>