MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/omg-2-movie8ab1bc46-ece1-42a4-ba8a-2df67539c9b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/omg-2-movie8ab1bc46-ece1-42a4-ba8a-2df67539c9b9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోల హవా భారీగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. హీరోయిన్ల పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. దీంతో సౌత్ భాషలో సినిమాలలో నటించడానికి చాలా మక్కువ చూపుతున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ పరేష్ రావెల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ మై గాడ్-2 చిత్రాన్ని డైరెక్టర్ అమిత్రామ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్రను పోషించడం జరిగింది. సీక్వెల్స్ లో మాత్రం అక్షయ్ కుమార్ ఈసారి శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోందిOMG-2;MOVIE{#}Akshay Kumar;Vaishno Devi;Dargah Sharif;court;Sex;Director;bollywood;Cinema;NewsOMG -2 అక్షయ్ కుమార్ చిత్రానికి సెన్సార్ కట్స్..!!OMG -2 అక్షయ్ కుమార్ చిత్రానికి సెన్సార్ కట్స్..!!OMG-2;MOVIE{#}Akshay Kumar;Vaishno Devi;Dargah Sharif;court;Sex;Director;bollywood;Cinema;NewsWed, 02 Aug 2023 07:30:00 GMTఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోల హవా భారీగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. హీరోయిన్ల పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. దీంతో సౌత్ భాషలో సినిమాలలో నటించడానికి చాలా మక్కువ చూపుతున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ పరేష్ రావెల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ మై గాడ్-2 చిత్రాన్ని డైరెక్టర్ అమిత్రామ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్రను పోషించడం జరిగింది. సీక్వెల్స్ లో మాత్రం అక్షయ్ కుమార్ ఈసారి శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సోషియో ఫాంటసీ కథాంశంతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డ్ 27 కట్స్ విధించినట్లు తెలుస్తోంది. పలు సంభాషణలో మార్పులను కూడా చేయమని సూచించినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ పోషిస్తున్న శివుడి పాత్రను మెసెంజర్ ఆఫ్ గాడ్ గా మార్చాలని సెన్సార్ బోర్డు సైతం ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఉపయోగించిన భగవద్గీత ,శివలింగ, ఆధర్వ వేదం ,రాసలీలలు వంటి పదాలను కూడా తొలగించాలని కోరడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీకి A సర్టిఫికెట్ కూడా రావడం జరిగింది.. సినిమా కోర్ పాయింట్ భారతదేశంలోని పాఠశాలలోని సెక్స్ ఎడ్యుకేషన్ తో వ్యవహరించబడుతున్నట్లు ఈ సినిమా కథ ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఇందులోనే పలు వల్గర్ వర్డ్స్ సన్నివేశాలను బర్రు చేయవలసిందిగా సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది అక్షయ్ కుమార్ దేవుడు పాత్రను పోషిస్తున్న దృష్టి ఆయనకు సంబంధించిన మద్యపాన సన్నివేశాలను కూడా పూర్తిగా తొలగించాలంటూ కూడా సెన్సార్ వారు ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .దాదాపుగా 15 నిమిషాల నిడివి గల కంటెంట్ ను సెన్సార్కు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్ లో ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. అయితే ఈ స్థాయిలో సెన్సార్ కట్స్ భారీ పడడంతో చిత్ర బృందం చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>