Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-50f29caa-c741-4aaf-8b10-b08a3d8663e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-50f29caa-c741-4aaf-8b10-b08a3d8663e6-415x250-IndiaHerald.jpgస్టువర్ట్ బ్రాడ్...ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అందరికి బాగా పరిచయమున్న పేరు ఇది. ౨౦౦౭, సెప్టెంబర్ 19న, ఇండియా కు ఇంగ్లాండ్కు మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో ఆరు బంతులతో ఆరు సిక్సులు బాది, ఒక మరపు రాని సన్నివేశాన్ని మన మనసులలో నింపాడు యువరాజ్ సింగ్. యువరాజ్ ఆ ఆరు సిక్సులు కొట్టింది స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లోనే. ఐతే ఇప్పుడు ఈయన గురుంచి డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఐదు టెస్ట్ మ్యాచ్ లు తో కూడిన ఈ సిరీస్ తరువాత తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచCricket {#}Ben Stokes;England;Australia;london;Cricket;India;septemberరెకార్డులకెక్కి రిటైర్ అయ్యాడు....చివరి మ్యాచ్ల్లో స్టువర్ట్ బ్రాడ్ సంచలనం?రెకార్డులకెక్కి రిటైర్ అయ్యాడు....చివరి మ్యాచ్ల్లో స్టువర్ట్ బ్రాడ్ సంచలనం?Cricket {#}Ben Stokes;England;Australia;london;Cricket;India;septemberTue, 01 Aug 2023 14:00:00 GMTస్టువర్ట్ బ్రాడ్...ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అందరికి బాగా పరిచయమున్న పేరు ఇది. ౨౦౦౭, సెప్టెంబర్ 19న, ఇండియా కు ఇంగ్లాండ్కు మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో ఆరు బంతులతో ఆరు సిక్సులు బాది, ఒక మరపు రాని సన్నివేశాన్ని మన మనసులలో నింపాడు యువరాజ్ సింగ్. యువరాజ్ ఆ ఆరు సిక్సులు కొట్టింది స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లోనే. ఐతే ఇప్పుడు ఈయన గురుంచి డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా?

ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఐదు టెస్ట్ మ్యాచ్ లు తో కూడిన ఈ సిరీస్ తరువాత తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించాడు స్టువర్ట్ బ్రాడ్. ఐతే ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ జులై 27 న లండన్ లో జరిగింది. ఇదే స్టువర్ట్ బ్రాడ్ కు చివరాఖరు మ్యాచ్. ఈ మ్యాచ్ల్లో ఆయన ఒక రికార్డు సృష్టించాడు. 37 ఏళ్ళ బ్రాడ్ తాను ఎదుర్కున్న ఆఖరి బంతిని సిక్సర్ గా మలిచి రికార్డు సృష్టించాడు. ఈ సిక్సర్తో బ్రాడ్ ఇంగ్లాండ్ తరుపున టెస్ట్ లలో అత్యధిక సిక్సలు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరిపోయాడు. తన క్రికెట్ కెరీర్ లో 167 టెస్టులు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ 124 సిక్సులతో మొదటి స్థానంలో ఉండగా, కెవిన్ పెటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయన్ బోథమ్ (67), రెండు, మూడు, నాలుగు స్థానాలలో ఉన్నారు.

స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్ లో 167 టెస్టులు,121 వన్ డైలు, 56 టీ 20లు ఆడాడు. ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు. టెస్ట్ లలో 602 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు. టెస్టులలో 244 ఇన్నింగ్స్ ఆడిన బ్రాడ్ 3662 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. తన ఆఖరి మ్యాచ్ కావడం తో, బ్యాటింగ్ కి వచ్చేముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ అఫ్ హానర్ అందుకున్నాడు బ్రాడ్.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>