EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ramojiraoa0191c55-332f-4eea-87ab-622d77bba499-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ramojiraoa0191c55-332f-4eea-87ab-622d77bba499-415x250-IndiaHerald.jpgరామోజీ రావు, సీఎం జగన్ కు పచ్చిగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొంది. గతం నుంచే ఇద్దరికి విబేధాలు ఉన్న మాట వాస్తవమే.. అవి ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ లో లావాదేవీలు మొత్తం అనైతికంగా అసంబద్ధంగా జరుగుతున్నాయని ప్రభుత్వం కోర్టులు కేసులు వేసింది. చిట్టి వేసిన వ్యక్తులు షూరిటీ చూపించకపోతే ఆ డబ్బులను డిపాజిట్ రూపంలో తీసుకుంటుందని చిట్టిని చిట్టిదారుడికి ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతుందంటూ ఇలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై మాRAMOJIRAO{#}ramoji rao;court;TDP;YCP;Jagan;CM;Andhra Pradesh;Elections;Governmentజనం సొమ్ముతో రామోజీపై పగతీర్చుకుంటున్న జగన్‌?జనం సొమ్ముతో రామోజీపై పగతీర్చుకుంటున్న జగన్‌?RAMOJIRAO{#}ramoji rao;court;TDP;YCP;Jagan;CM;Andhra Pradesh;Elections;GovernmentTue, 01 Aug 2023 13:00:00 GMTరామోజీ రావు, సీఎం జగన్ కు పచ్చిగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొంది. గతం నుంచే ఇద్దరికి విబేధాలు ఉన్న మాట వాస్తవమే.. అవి ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ లో లావాదేవీలు మొత్తం అనైతికంగా అసంబద్ధంగా జరుగుతున్నాయని ప్రభుత్వం కోర్టులు కేసులు వేసింది. చిట్టి వేసిన వ్యక్తులు షూరిటీ చూపించకపోతే ఆ డబ్బులను డిపాజిట్ రూపంలో తీసుకుంటుందని చిట్టిని చిట్టిదారుడికి ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతుందంటూ ఇలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.


అయితే దీనిపై మార్గదర్శిని కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని కోరడంతో వాటిని కోర్టు కు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సమర్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శికి వ్యతిరేకంగా దాదాపు అన్ని పత్రికల్లో మార్గదర్శి చేస్తున్న మోసాల గురించి దాదాపు రూ.10 కోట్లు పెట్టించి యాడ్ లు ఇస్తోంది. ప్రజలకు అర్థం కావాలని రామోజీ రావు అనైతికంగా ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని తెలిపేందుకు జగన్ ప్రభుత్వం ఆయా పత్రికలకు యాడ్ లు ఇస్తున్నారు.


దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్, రామోజీ మధ్య ఉన్న వైరం కాస్త ప్రభుత్వ సొమ్మును ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నారంటూ కొంతమంది ఆయన తీరును తప్పు బడుతున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుని వాటితో వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.


అయితే ఇప్పటికే వివిధ ఆర్థిక నేరారోపణల కింద కొన్ని కోట్ల రూపాయల సొమ్మును ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. జగన్ రామోజీ వైరం ముదిరి పాకాన పడుతున్నట్లే తెలుస్తోంది. మరో ఏడాదిలో ప్రభుత్వం దిగిపోతుంది. ఎన్నికలు రానున్నాయి. ఆ లోపే ఏదైనా చేసేయాలన్న కసి జగన్ లో కనిపిస్తోంది. అందుకే రామోజీకి సంబంధించిన సంస్థ అయినా మార్గదర్శిని టార్గెట్ చేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>