Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumrac7657067-5058-42d5-948d-b00fa7d2021a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumrac7657067-5058-42d5-948d-b00fa7d2021a-415x250-IndiaHerald.jpgభారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే అయితే మధ్యలో ఓసారి అటు గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ ఒక్క మ్యాచ్ తోనే పాత గాయం తిరగబెట్టడంతో చివరికి పూర్తి మ్యాచ్ ఆడకుండానే మైదానం వీడాడు బుమ్రా కాగా సర్జరీ చేయించుకుని ఇక ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అన్న విషయంపై మాత్రం ఒBumra{#}Shivam;Ireland;Yashasvi Jaiswal;Mukesh;BCCI;World Cup;Cricketవావ్.. బుమ్రా రీ ఎంట్రీ.. కెప్టెన్ గా ప్రమోషన్?వావ్.. బుమ్రా రీ ఎంట్రీ.. కెప్టెన్ గా ప్రమోషన్?Bumra{#}Shivam;Ireland;Yashasvi Jaiswal;Mukesh;BCCI;World Cup;CricketTue, 01 Aug 2023 15:15:00 GMTభారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే మధ్యలో ఓసారి అటు గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ ఒక్క మ్యాచ్ తోనే పాత గాయం తిరగబెట్టడంతో చివరికి పూర్తి మ్యాచ్ ఆడకుండానే మైదానం వీడాడు బుమ్రా  కాగా సర్జరీ చేయించుకుని ఇక ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అన్న విషయంపై మాత్రం ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అతను  వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వస్తాడని బిసిసిఐ వర్గాలు కూడా తెలిపాయ్. అయితే ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి  అయితే ఇటీవల బీసీసీఐ ఏకంగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ టి20 సిరీస్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా.. ఇక ఇందులో బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు  అయితే ఈ స్టార్ బౌలర్ అభిమానులందరికీ కూడా డబుల్ ట్రీట్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఎందుకంటే బుమ్రా జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు అని చెప్పడమే కాదు అతనికి కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.


 ఈ క్రమంలోని ఐర్లాండ్తో టి20 సిరీస్ కు బుమ్రా సారధిగా ఎంపిక అవ్వగా.. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ గా నియమితుడు అయ్యాడు. కాగా ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్ టీమిండియా మధ్య 320 మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక పూర్తి జట్టు వివరాలు చూసుకుంటే యశస్వి జైష్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు, జితేష్ శర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్,శాబాజ్, బిష్ణయ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ లు ఐర్లాండ్   పర్యటన కోసం ఎంపికయ్యారు.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>