MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan85fd435d-8810-4bd5-9ff7-bde6803af07d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan85fd435d-8810-4bd5-9ff7-bde6803af07d-415x250-IndiaHerald.jpgగతవారం విడుదలైన ‘బ్రో’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కొంతవరకు పవన్ కళ్యాణ్ మ్యానియా ఈమూవీ బయ్యర్లకు భారీ నష్టాలు లేకుండా రక్షించింది అన్నఅంచనాలు ఉన్నప్పటికీ ఈమూవీ బయ్యర్లు ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతారు అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘వినోదయ సితం’ రీమేక్ గా రూపొందిన ఈమూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్రను డిజైన్ చేసే విషయంలో దర్శకుడు సముద్రఖని ఎందుకు పొరపాట్లు చేసాడో చాలామందికి అర్థంకాని విషయంగా మారింది. ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్ర కలిపురుషుడి ఆశీస్సులతో మళ్ళీ బ్రతుకుతాడు. అయితే బ్రతకడాPAVANKALYAN{#}trivikram srinivas;Audience;Samuthirakani;Remake;Darsakudu;sai dharam tej;kalyan;Hero;Directorబ్రో లో జరిగిన పొరపాట్లు !బ్రో లో జరిగిన పొరపాట్లు !PAVANKALYAN{#}trivikram srinivas;Audience;Samuthirakani;Remake;Darsakudu;sai dharam tej;kalyan;Hero;DirectorTue, 01 Aug 2023 08:06:45 GMTగతవారం విడుదలైన ‘బ్రో’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కొంతవరకు పవన్ కళ్యాణ్ మ్యానియా ఈమూవీ బయ్యర్లకు భారీ నష్టాలు లేకుండా రక్షించింది అన్నఅంచనాలు ఉన్నప్పటికీ ఈమూవీ బయ్యర్లు ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతారు అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘వినోదయ సితం’ రీమేక్ గా రూపొందిన ఈమూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్రను డిజైన్ చేసే విషయంలో దర్శకుడు సముద్రఖని ఎందుకు పొరపాట్లు చేసాడో చాలామందికి అర్థంకాని విషయంగా మారింది.



‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్ర కలిపురుషుడి ఆశీస్సులతో మళ్ళీ బ్రతుకుతాడు. అయితే బ్రతకడానికి రెండవ అవకాశం పొందిన హీరో సెకండ్ ఛాన్స్ లో పక్కా తాగుబోతుగా మారిపోతాడు. రెండవ ఛాన్స్ పొందిన హీరో చాల సమయం బార్ లోనే కాలం గడుపుతూ ఉంటాడు. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయిన తేజ్ కలిపురుషుడు తనకు ఇచ్చిన అవకాశంతో మందు కొట్టి పబ్ లలో చిందులు వేస్తే జీవితాన్ని ఆస్వాదించడం అంటే ఇదేనా అంటూ ఈమూవీని చూసిన ప్రేక్షకులు కొందరు ఆశ్చర్యపోతున్నారు.



అయితే ఈసినిమాకు మాతృక అయిన ‘వినోదయ సితం’ మూవీలో మళ్ళీ బ్రతికిన హీరో తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాడు. అందరిలోనూ మంచి వాడుగా పేరును సంపాదించుతాడు. దీనితో దేవుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని హీరో సద్వినియోగం చేసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ‘బ్రో’ విషయానికి వచ్చేసరికి తేజ్ పాత్ర డిజైనింగ్ లో తప్పులు సముద్రఖని పొరపడ్డాడా లేదంటే ఈ మూవీకి స్క్రిప్ట్ వ్రాసిన త్రివిక్రమ్ పొరపడ్డాడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



వాస్తవానికి ఈసినిమాకు డైలాగ్స్ త్రివిక్రమ్ వ్రాయడంతో త్రివిక్రమ్ స్థాయిలో ఈసినిమాలో డైలాగ్స్ ఉంటాయి అని చాలామంది భావించారు. ఈమూవీలో వచ్చే ‘బ్రతికేది చచ్చేది కూడ భావితరాల కోసమే’ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసిన డైలాగ్స్ లోని అర్థాలు ఏమిటి అంటూ ఈసినిమా రివ్యూలు వ్రాసిన వారు కూడ తలలు పట్టుకుంటున్నట్లు టాక్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే నచ్చే సినిమాగా ‘బ్రో’ మిగిలి పోతుందా అన్న సందేహాలు అందరిలోను ఉన్నాయి..



RRR Telugu Movie Review Rating

"జవాన్" మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు ఏకంగా అంతా కోడ్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>