PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-leaders-are-worried-that-bandi-sanjay-will-try-to-create-hurdles-for-them-in-upcoming-telangana-pollsbccc324e-6694-41a4-95c8-f6ef0e16a999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-leaders-are-worried-that-bandi-sanjay-will-try-to-create-hurdles-for-them-in-upcoming-telangana-pollsbccc324e-6694-41a4-95c8-f6ef0e16a999-415x250-IndiaHerald.jpgఇక ఏపీ బలోపేతం చేసేస్తారని నానా రచ్చ చేస్తోంది ఎల్లోమీడియా. తెలంగాణాలో మాత్రం బండి బీజేపీని బలోపేతం చేసిందేముంది ? నిజంగానే పార్టీని బండి అంత బలోపేతం చేస్తే, రాబోయే ఎన్నికల్లో బండే పార్టీని అధికారంలోకి తెచ్చేస్తారనే నమ్మకం ఉంటే మరి అధ్యక్షుడిగా ఎందుకు మార్చేసినట్లు ? బండి బాధ్యతల్లో ఉన్నంతకాలం పార్టీని క్షేత్రస్ధాయిలో ఏమన్నా బలోపేతంచేశారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారమే 119 నియోజకవర్గాల్లో మహాయితే 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే చాలా ఎక్కువట. bjp bandi telangana {#}KCR;sunil;Eatala Rajendar;Andhra Pradesh;Amith Shah;venkaiah naidu;Raccha;Chakram;Party;Narendra Modi;Bharatiya Janata Party;Newsహైదరాబాద్ : బండికి అంత సీనుందా ?హైదరాబాద్ : బండికి అంత సీనుందా ?bjp bandi telangana {#}KCR;sunil;Eatala Rajendar;Andhra Pradesh;Amith Shah;venkaiah naidu;Raccha;Chakram;Party;Narendra Modi;Bharatiya Janata Party;NewsTue, 01 Aug 2023 07:00:00 GMT


ఏపీ బీజేపీ ఇన్చార్జిగా ఉన్న సునీల దేవధర్ ను బీజేపీ అగ్రనేతలు తప్పించారు. సునీల్ ప్లేసులో ఎవరిని నియమించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారట. ఇంతలో ఎల్లోమీడియా బండి సంజయ్ పేరును తెరమీదకు తెచ్చింది. ఎందుకంటే తెలంగాణా అధ్యక్ష బాధ్యతల నుండి బండిని అగ్రనేతలు తప్పించారు. అధ్యక్షుడిగా తప్పించిన బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దాంతో ఎల్లోమీడియా వెంటనే పాట అందుకునేసింది. బండిని ఏపి ఇన్చార్జిగా నియమించబోతున్నారంటు ఒకటే ఊదరగొడుతోంది.





ఎందుకంటే ఏపీలో బీజేపీని బలోపేతం చేయటానికేనట. తెలంగాణాలో బీజేపీని బలోపేతంచేసినట్లే ఏపీలో కూడా బలోపేతం చేస్తారంటు ఎల్లోమీడియా భాష్యాలు చెప్పేస్తోంది. అయితే ఇక్కడే ఒక సందేహం పెరిగిపోతోంది. తెలంగాణాలోనే పార్టీ బలోపేతానికి చేసిందేమీలేదు. తెలంగాణా అధ్యక్షుడి హోదా వేరు జాతీయ ప్రధాన కార్యదర్శి అనే హోదా వేరు. అధ్యక్షుడంటే ఒకళ్ళే ఉంటారు. అదే జాతీయ ప్రధానకార్యదర్శంటే వందల్లో ఒకడు అంతే.





ఇక ఏపీ బలోపేతం చేసేస్తారని నానా రచ్చ చేస్తోంది ఎల్లోమీడియా. తెలంగాణాలో మాత్రం బండి బీజేపీని బలోపేతం చేసిందేముంది ? నిజంగానే పార్టీని బండి అంత బలోపేతం చేస్తే, రాబోయే ఎన్నికల్లో బండే పార్టీని అధికారంలోకి తెచ్చేస్తారనే నమ్మకం ఉంటే మరి అధ్యక్షుడిగా ఎందుకు మార్చేసినట్లు ? బండి బాధ్యతల్లో ఉన్నంతకాలం పార్టీని క్షేత్రస్ధాయిలో ఏమన్నా బలోపేతంచేశారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారమే 119 నియోజకవర్గాల్లో మహాయితే 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే చాలా ఎక్కువట.




అభ్యర్ధులు లేరుకాబట్టే ఇతరపార్టీల్లోని గట్టినేతలకు గాలమేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బండి చేసిందేమిటి ? ఓల్డ్ సిటీలోని భాగ్యనగర్ టెంపుల్లో పూజలు, ఎంఐఎంకు సవాళ్ళు. తెల్లారి లేచిందగ్గర నుండి సాయంత్రంవరకు కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని తిట్టిన తిట్టు తిట్టడమే. పాదయాత్రలని, సమావేశాలని, దీక్షలపేరుతో కాస్త హడావుడి చేసిందైతే వాస్తవం. ఇక దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రఘునందనరావు, ఈటల రాజేందర్ గెలిచారంటే వాళ్ళ ఇమేజితో గెలిచిందే కానీ పార్టీ, బండి వల్లకాదు.





ఇక ఏపీ సంగతిచూస్తే బండి కాదు కదా స్వయంగా అమిత్ షా నే బాధ్యతలు తీసుకున్నా పార్టీ గ్రాఫ్ పెరగదు. ఎందుకంటే పార్టీ గ్రాఫ్ పెరగకుండా పాతాళానికి తొక్కేసిందే నరేంద్రమోడీ కాబట్టి. దశాబ్దాల పాటు వెంకయ్యనాయుడు నాయకత్వంలో టీడీపీకి పార్టీని బీ టీముగా చేసేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ సొంతంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చింది. అయితే విభజన హామీలను తుంగలోతొక్కేయటంతో బలపడే అవకాశాన్ని మోడీ దెబ్బకొట్టేశారు. అందుకనే ఏపీఇన్చార్జిగా బండి వచ్చినా చేయగలిగేదేమీ ఉండదు. తెలంగాణాలోనే తిరగని బండి చక్రం ఏపీలో తిరుగుతుందా ?







RRR Telugu Movie Review Rating

పుష్ప 2 లో గెస్ట్ రోల్.. రంగంలోకి ఆ స్టార్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>