PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-purandeswari-jaganae1bb1ca-1a78-4045-b76a-db0051c65162-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-purandeswari-jaganae1bb1ca-1a78-4045-b76a-db0051c65162-415x250-IndiaHerald.jpgఎందుకంటే వైసీపీని ఎటాక్ చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీ వైపుకు వస్తాయని బహుశా ఆమె లెక్కేసుకున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్ల వల్ల బీజేపీ+జనసేన లాభపడుతుందని ఆమె అంచనా అయ్యుండచ్చు. అయితే ఆమె మరచిపోయిందేమిటంటే ప్రభుత్వవ్యతిరేక ఓట్లు వెళితే తెలుగుదేశంపార్టీకి వెళ్ళే అవకాశం ఉందికానీ బీజేపీకి ఎందుకు వస్తాయి ? ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడీ తుంగలో తొక్కేస్తున్నారనే మంట జనాల్లో బాగా ఉంది.bjp purandeswari jagan{#}Jagan;Andhra Pradesh;Daggubati Purandeswari;YCP;Mudragada Padmanabham;Reddy;Yatra;Narendra Modi;Bharatiya Janata Partyఅమరావతి : పురందేశ్వరి వ్యూహం వర్కవుటవుతుందా ?అమరావతి : పురందేశ్వరి వ్యూహం వర్కవుటవుతుందా ?bjp purandeswari jagan{#}Jagan;Andhra Pradesh;Daggubati Purandeswari;YCP;Mudragada Padmanabham;Reddy;Yatra;Narendra Modi;Bharatiya Janata PartyTue, 01 Aug 2023 05:00:00 GMT



బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరనుండి దగ్గుబాటి పురందేశ్వరి ఒకటే టార్గెట్ పెట్టుకున్నట్లున్నారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవవటం. ఇప్పటికి పదిరోజులుగా ఆమె పదేపదే చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  బీజేపీ అధికార వైసీపీకి ప్రతిపక్షమే కాబట్టి ఎలాంటి ఆరోపణలు చేయాలి ? ఎవరిని ఎటాక్ చేయాలన్నది పూర్తిగా ఆధ్యక్షురాలి ఇష్టమే అనుకుందాం. అయితే ఆమె పదేపదే వైసీపీనే ఎందుకు ఎటాక్ చేస్తున్నారు ?





ఎందుకంటే వైసీపీని ఎటాక్ చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీ వైపుకు వస్తాయని బహుశా ఆమె లెక్కేసుకున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్ల వల్ల బీజేపీ+జనసేన లాభపడుతుందని ఆమె అంచనా అయ్యుండచ్చు. అయితే ఆమె మరచిపోయిందేమిటంటే ప్రభుత్వవ్యతిరేక ఓట్లు వెళితే తెలుగుదేశంపార్టీకి వెళ్ళే అవకాశం ఉందికానీ బీజేపీకి ఎందుకు వస్తాయి ? ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడీ తుంగలో తొక్కేస్తున్నారనే మంట జనాల్లో బాగా ఉంది.





అందుకనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వెళితే టీడీపీకి వెళతాయే కానీ బీజేపీకి పడే అవకాశాలు చాలా తక్కువ. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నది కాబట్టి జనసేనకు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడే అవకాశాలు లేవనే అనుకోవాలి. వారాహియాత్ర పార్టీకి బాగా ప్లస్సయిందని పవన్ అనుకుంటున్నారు. కానీ కాపు ప్రముఖల లెక్కప్రకారం జనసేనకు మైనస్సే. పవన్ యాత్ర చేయకుండా ఉంటేనే ఎంతోకొంత మేలుండేదట.





కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానభం మీద అవినీతి ఆరోపణలు చేయటం పవన్ కు పెద్ద మైనస్ అయినట్లు కాపు ప్రముఖులంటున్నారు. అలాగే హ్యూమన్ ట్రాఫికింగుకు పాల్పడుతున్నట్లు వాలంటీర్ల మీద నిరాధార ఆరోపణలు చేయటం కూడా మైనస్సే అంటున్నారు. అంటే బీజేపీకి ఒకరకంగా మైనస్సుంటే జనసేనకు మరో రకంగా మైనస్సులున్నాయనేది టాక్.  ఒకవైపేమో కేంద్రప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది. ఈ పరిస్ధితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లును రాబట్టుకోవాలన్న పురందేశ్వరి వ్యూహం వర్కవుటవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుంటే మరి ఎవరికి పడతాయో చూడాలి.




RRR Telugu Movie Review Rating

పుష్ప 2 లో గెస్ట్ రోల్.. రంగంలోకి ఆ స్టార్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>