Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl201669e2-be1d-4465-bd9e-541aa4567692-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl201669e2-be1d-4465-bd9e-541aa4567692-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఇక ఆటగాళ్లు భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విదేశీ ఆటగాళ్లకు సైతం ఈ భారత టి20 లీగ్ లో భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అంతర్జాతీయ మ్యాచులను సైతం పక్కనపెట్టి ఐపీఎల్లో ఆడటానికి తరలివస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకి అటు అంతర్జాతీయ క్రికెట్లో ఊహించని రీIpl{#}BCCI;Texas;Cricket;INTERNATIONAL;Indianప్చ్.. ఐపీఎల్ హీరో.. అక్కడ తుస్సుమనిపించాడే?ప్చ్.. ఐపీఎల్ హీరో.. అక్కడ తుస్సుమనిపించాడే?Ipl{#}BCCI;Texas;Cricket;INTERNATIONAL;IndianMon, 31 Jul 2023 09:30:00 GMTప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఇక ఆటగాళ్లు భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విదేశీ ఆటగాళ్లకు సైతం ఈ భారత టి20 లీగ్ లో భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అంతర్జాతీయ మ్యాచులను సైతం పక్కనపెట్టి ఐపీఎల్లో ఆడటానికి తరలివస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకి అటు అంతర్జాతీయ క్రికెట్లో ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి.


 అంతేకాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే దేశీయ లీగ్ లలో ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పాలి. ఇక అన్ని ఫ్రాంచైజీలు వారిని భారీ ధర పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా ఐపిఎల్ లో రాణించిన కొంతమంది ఆటగాళ్లు మిగతా లీగ్ లలో మాత్రం తుస్సు మనిపించడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొట్టి భారీ పరుగులు చేసిన ఒక స్టార్ ప్లేయర్ మరో లీగ్ లో మాత్రం తుస్సుమనిపించాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న డూప్లెసెస్.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ గా ఏకంగా 730 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం అమెరికన్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగమయ్యాడు డూప్లెసెస్. అక్కడ మాత్రం తన ప్రదర్శనతో చిరాకు తెప్పిస్తున్నాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న డూప్లెసెస్ ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టోర్నీలో అతని అత్యధిక స్కోరు 14 మాత్రమే కావడం గమనార్హం. కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో సైతం ఆరు పరుగుల మాత్రమే చేశాడు. దీంతో నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ చివరికి టోర్ని నుంచి నిష్క్రమించింది.



RRR Telugu Movie Review Rating

తమన్నా పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టార్ హీరో.. దాని కోసమేనా..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>