Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled6e2498b-2b45-43f6-9d97-89a6a74552e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled6e2498b-2b45-43f6-9d97-89a6a74552e4-415x250-IndiaHerald.jpgయూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది.తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు. బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా వైష్ణవsocialstars lifestyle{#}Sanjay Dutt;boyapati srinu;ram pothineni;festival;Chaitanya;bollywood;BEAUTY;Hero;Tollywood;Cinema;Heroineహీరో 'రామ్' ఆ హీరోయిన్ కి ఫ్లవర్ బొకే పంపడానికి కారణం....??హీరో 'రామ్' ఆ హీరోయిన్ కి ఫ్లవర్ బొకే పంపడానికి కారణం....??socialstars lifestyle{#}Sanjay Dutt;boyapati srinu;ram pothineni;festival;Chaitanya;bollywood;BEAUTY;Hero;Tollywood;Cinema;HeroineMon, 31 Jul 2023 15:00:00 GMTయూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది.తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు.

బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా వైష్ణవి చైతన్య ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. రెండో సినిమానే ఓ స్టార్ హీరోతో చేయబోతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు..ఉస్తాద్ రామ్ పోతినేని. బోయపాటి దర్శకత్వంలో `స్కంద` పూర్తి చేసిన రామ్‌.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో `డబుల్ ఇస్మార్ట్‌`ను పట్టాలెక్కించాడు.

బ్లాక్ బస్టర్ మూవీ `ఇస్మార్ట్ శంకర్‌`కు సీక్వెల్ ఇది. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అయితే ఒక హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారని అంటున్నారు. బేబీలో వైష్ణవి నటన పూరీని బాగా ఆకట్టుకుందట.ఈ నేపథ్యంలోనే ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల వైష్ణవికి రామ్ పెద్ద ఫ్లెవర్ బొకేను పంపాడు. అయితే అది బేబీ మూవీ సక్సెస్ అయినందుకు మాత్రమే కాదు.. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా ఎంపిక అయినందుకు కూడా అని అంటున్నారు.

ఐతే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పక్కన బేబీ బ్యూటీ కలిసి చేయడం అనేది ఇద్దరు ఫ్యాన్స్ కు కన్నుల పండుగ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఏదేమైన మొదటి సినిమాతోనే విజయం అందుకున్న వైష్ణవి చైతన్య కు ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సీన్స్ లో.. నా నటన నాకే నచ్చలేదు : తమన్నా

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>