PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telengana-bjp-jayasudha-0c209f3c-0217-4ef4-ad11-0d9a7557bd52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telengana-bjp-jayasudha-0c209f3c-0217-4ef4-ad11-0d9a7557bd52-415x250-IndiaHerald.jpgవీళ్ళతో పాటు జయసుధ కూడా బీజేపీలో చేరబోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ పెరిగిపోతోంది. గతంలో కాంగ్రెస్ తరపున జయసుధ సికింద్రాబాద్ ఎంఎల్ఏగా పనిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు కాబట్టి గెలిచారన్న విషయాన్ని ఆమె మరచిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. ఎందుకిన్ని పార్టీలను జయసుధ తిరిగేస్తున్నారు ? telengana bjp jayasudha {#}Vijayashanti;jayasudha;Ranga Reddy;MLA;Congress;Bharatiya Janata Party;Party;Newsహైదరాబాద్ : బీజేపీలోకి జయసుధ ?హైదరాబాద్ : బీజేపీలోకి జయసుధ ?telengana bjp jayasudha {#}Vijayashanti;jayasudha;Ranga Reddy;MLA;Congress;Bharatiya Janata Party;Party;NewsSun, 30 Jul 2023 03:00:00 GMT


ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లే ఉంది. కొందరు మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్సీలతో పాటు  సినీనటి జయసుధ కూడా బీజేపీలో చేరటానికి ప్లాన్ చేస్తున్నారట. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో జయసుధ భేటీ అయ్యారు. వీళ్ళ భేటితో జయసుధ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం బాగా పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి ఎంఎల్ఏగా పోటీచేయాలనే ఆలోచనను జయసుధ అద్యక్షుడి ముందుంచినట్లు పార్టీలో టాక్ వినబడుతోంది.





ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి చాలా చోట్ల గట్టి అభ్యర్దులు లేరు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మహాయితే ఓ 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే అదే ఎక్కువ. ఇలాంటి పరిస్ధితుల్లో ఎంతమంది వస్తే అంతమందిని, ఎవరొస్తే వాళ్ళని పార్టీలో చేర్చుకునేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంఎల్ఏ ఆకుల రాజేందర్, మాజీ ఎంఎల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంఎల్ఏ అమరాజుల శ్రీదేవి, సంజీవరావు కాషాయ కండువా కప్పుకోబోతున్నారట.





వీళ్ళతో పాటు జయసుధ కూడా బీజేపీలో చేరబోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ పెరిగిపోతోంది. గతంలో కాంగ్రెస్ తరపున జయసుధ సికింద్రాబాద్ ఎంఎల్ఏగా పనిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు కాబట్టి గెలిచారన్న విషయాన్ని ఆమె మరచిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. ఎందుకిన్ని పార్టీలను జయసుధ తిరిగేస్తున్నారు ?





ఎందుకంటే ఆమెను ఏ పార్టీలను పట్టించుకోవటంలేదు. ఎందుకంటే సినీ సెలబ్రిటీ అనే ఇమేజి తప్ప ఇంకెలాంటి కెపాసిటి లేదుకాబట్టే. ఒకవైపు పార్టీలోనే ఉన్న విజయశాంతి బీజేపీలో నుండి బయటకు వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో జయసుధ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అంటే ఒక సెలబ్రిటి బయటకు వచ్చేస్తే మరో సెలబ్రిటి పార్టీలో చేరబోతున్నారన్నమాట.




RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>