HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health268ff8d2-2629-4aa6-bb18-e0ebc9d13c49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health268ff8d2-2629-4aa6-bb18-e0ebc9d13c49-415x250-IndiaHerald.jpgతమలపాకు గురించి మనందరికీ తెలిసిందే. ఇవి చక్కటి వాసనను ఇంకా అలాగే ఘాటైన రుచిని కలిగి ఉంటాయి.తమలపాకు మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇందులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయని తమలపాకులను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత ఇంకా కఫ దోషాలు చాలా ఈజీగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తమలపాకులో ఉండే ఔషధ గుణాలను అలాగే దీని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ తమలపాకులో నొప్పిని నివారించే మంచి గుణం ఉంది. తలనొప్పిని తhealth{#}oil;Ayurveda;Betel;Manamతమలపాకుతో ఆరోగ్యానికి అద్భుతాలు బోలెడు?తమలపాకుతో ఆరోగ్యానికి అద్భుతాలు బోలెడు?health{#}oil;Ayurveda;Betel;ManamSun, 30 Jul 2023 16:49:00 GMTతమలపాకు గురించి మనందరికీ తెలిసిందే. ఇవి చక్కటి వాసనను ఇంకా అలాగే ఘాటైన రుచిని కలిగి ఉంటాయి.తమలపాకు మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇందులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయని తమలపాకులను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత ఇంకా కఫ దోషాలు చాలా ఈజీగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తమలపాకులో ఉండే ఔషధ గుణాలను అలాగే దీని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ తమలపాకులో నొప్పిని నివారించే మంచి గుణం  ఉంది. తలనొప్పిని తగ్గించడంలో తమలపాకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. తమలపాకును తీసుకొని దానిని కచ్చా పచ్చాగా దంచి నుదుటి మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి ఈజీగా తగ్గుతుంది. అలాగే జీర్ణశక్తిని పెంచడంలో కూడా తమలపాకు మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ తమలపాకును నమలడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.


ఇంకా అలాగే మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా తమలపాకు మనకు బాగా సహాయపడుతుంది. పొద్దున్నే పరగడుపున తమలపాకును నమిల తినడం వల్ల మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే మన పొట్టలో పేరుకుపోయిన మలినాలను, విష పదార్థాలను ఈజీగా తొలగించి ఆకలి పెరిగేలా చేయడంలో కూడా తమలపాకు మనకు సహాయపడుతుంది. అలాగే తమలపాకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా ఈజీగా నశిస్తుంది. ఇంకా దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. చిగుళ్లు ఇంకా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే తమలపాకుకు ఆవాల నూనె రాసి ఆ ఆకును వేడి చేయాలి. ఆ తరువాత ఈ ఆకును ఛాతి మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు తమలపాకును నమిలి తినడం వల్ల దగ్గు నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.



RRR Telugu Movie Review Rating

సూర్య43: సాలిడ్ స్టోరీతో అప్పటినుంచి షూటింగ్ స్టార్ట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>