PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs-telangana-kcraefeec47-ab29-4285-a544-4e7269f3838a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs-telangana-kcraefeec47-ab29-4285-a544-4e7269f3838a-415x250-IndiaHerald.jpgఅంటే కేసీయార్ వ్యవహారం ఎలాగుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతకు సరిగ్గా సరిపోతోంది. అందుకనే ప్రతిపక్షాలు తరచూ తెలంగాణాను బీఆర్ఎస్ పార్టీ కాకుండా కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీయే పరిపాలిస్తోందని సెటైర్లు వేస్తుంటాయి. అయినా కేసీయార్ తగ్గటంలేదు. అవకాశం ఉన్నపుడే కదా చేసుకోవాల్సింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ కొడుకు, మేనల్లుడు అన్నీ అధికారాలను గుప్పిటపట్టి ఎంజాయ్ చేస్తున్నారు. brs telangana kcr{#}KCR;kavitha;Santhossh Jagarlapudi;MP;Maharashtra;House;Delhi;Partyహైదరాబాద్ : ఫ్యామిలీని మహారాష్ట్రకు విస్తరించారా ?హైదరాబాద్ : ఫ్యామిలీని మహారాష్ట్రకు విస్తరించారా ?brs telangana kcr{#}KCR;kavitha;Santhossh Jagarlapudi;MP;Maharashtra;House;Delhi;PartySun, 30 Jul 2023 05:00:00 GMT


తెలంగాణాలో బాగా పాపులరైన కల్వకుంట్ల ఫ్యామిలీని కేసీయార్ పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు అర్ధమవుతోంది. తాజాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఇన్చార్జిగా కల్వకుంట్ల వంశీధరరావును నియమించారు. ఇప్పటికే తెలంగాణాలో కొడుకు, మేనల్లుడు కేటీయార్, హరీష్ రావు మంత్రులుగా ఉన్నారు. కూతురు కవిత ఎంఎల్సీగా ఉన్నారు. మరో దగ్గరి బంధువు సంతోష్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వీళ్ళు సరిపోరన్నట్లుగా తన అన్నకొడుకు వంశీధరరావుకు మహాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు.





అంటే కేసీయార్ వ్యవహారం ఎలాగుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతకు సరిగ్గా సరిపోతోంది. అందుకనే ప్రతిపక్షాలు తరచూ తెలంగాణాను బీఆర్ఎస్ పార్టీ కాకుండా కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీయే పరిపాలిస్తోందని సెటైర్లు వేస్తుంటాయి. అయినా కేసీయార్ తగ్గటంలేదు. అవకాశం ఉన్నపుడే కదా చేసుకోవాల్సింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ కొడుకు, మేనల్లుడు అన్నీ అధికారాలను గుప్పిటపట్టి ఎంజాయ్ చేస్తున్నారు.





ఇక కూతురు కవిత సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కేసీయార్ కూతురి హోదాలో కవిత చాలా వ్యవహారాలను చక్కబెట్టేసుకుంటున్నారంటు ప్రతిపక్షాలు గోల గోల చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం అందరికీ తెలిసిందే. స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున సూత్రదారే కవితగా ఈడీ చార్జిషీట్లలో చాలాచోట్ల కవిత పేరును ప్రస్తావించింది. కేసీయార్ కూతురు హోదాను అడ్డుపెట్టుకుని కవిత రాష్ట్రంలో ఎన్ని వ్యాపారాలు చేస్తున్నది, భూములను తక్కువ ధరలకు ఎలా కొంటున్నది ఉదాహరణలతో సహా చెప్పింది.





రాజ్యసభ ఎంపీ సంతోష్ వ్యవహారాలు ఇంకా తెరమీదకు రాలేదు. ఇంతలోనే వంశీధరరావు నియామకం జరిగిపోయింది. పార్టీలో ఇంకెవరూ లేనట్లు అన్నకొడుకునే మహారాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా నియమించటమే ఆశ్చర్యంగా ఉంది. మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని అందుకు వంశీయే కారణం కాబట్టే కేసీయార్ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. కేసీయార్ మనసు తెలిసిన తర్వాత ఎవరైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేస్తారా ?




RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>