EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud2efb541-d1b2-4d0d-9d87-c3fda419fa1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud2efb541-d1b2-4d0d-9d87-c3fda419fa1e-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు జగన్ ని మొదటి నుండి తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. జగన్ ని అలా విమర్శిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మాస్టార్ తరహాలో జగన్ తప్పులను.. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా రోజూ విమర్శించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ ఇరిగేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో జగన్ ప్రజలకు లెక్కలు వివరించాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ CHANDRABABU{#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Congress;Hanu Raghavapudi;Aqua;TDP;YCP;Party;Jagan;CBN;thursday;Government;Telangana Chief Ministerఅప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?CHANDRABABU{#}Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Congress;Hanu Raghavapudi;Aqua;TDP;YCP;Party;Jagan;CBN;thursday;Government;Telangana Chief MinisterSun, 30 Jul 2023 06:00:00 GMTచంద్రబాబు నాయుడు జగన్ ని మొదటి నుండి తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. జగన్ ని అలా విమర్శిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మాస్టార్ తరహాలో జగన్ తప్పులను.. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా రోజూ విమర్శించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ ఇరిగేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో జగన్  ప్రజలకు లెక్కలు వివరించాలన్నారు.


తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ నిధులు కేటాయించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ శాఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన అన్నారు. 2014-19 లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు  సాగు నీటి ప్రాజెక్టుల కోసం 68,293 కోట్లను ఖర్చుపెట్టిందని, వైసిపి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కోసం 22 వేల 165 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన లెక్కలు చెప్పారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ శాఖ పడకేసిందని ఆయన అన్నారు. జగన్ ఒక అజ్ఞాని అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థత వల్లే సాగునీటి రంగం వెనుకబడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విషయంలో స్పష్టంగా తన వివరణను ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కోస్తాంధ్రలో 96, రాయలసీమలో 102 ఇలా దాదాపుగా 198 ప్రాజెక్టులు  మూతపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.


ఇలా జగన్ వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయని చంద్రబాబు అన్నారు. సంవత్సరాల వారీగా 2014-15లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 317 కోట్లు బడ్జెట్ పెడితే, 9223 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు. ఇలా 2014 నుండి 2019 వరకు 55893 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. సాగునీటి రంగానికి జగన్ మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని  చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.



RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>