Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohtihb48724d1-0cdc-41bb-8d7d-70cfac393759-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohtihb48724d1-0cdc-41bb-8d7d-70cfac393759-415x250-IndiaHerald.jpgటీమిండియా యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ విషయంలో గత కొంతకాలం నుంచి భారత సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో రాణించిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు అటు వెంటనే జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని కల్పిస్తున్న సెలెక్టర్లు ఎందుకో అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్న సంజు శాంసన్ ను మాత్రం జట్టులోకి తీసుకోవడం లేదు. ఒకవేళ సంజు శాంసన్ ను ఏదైనా పర్యటన కోసం సెలెక్ట్ చేసిన తుది జట్టులోకి మాత్రం ఎంపిక చేయడం లేదు అని చెప్పాలి. అయితే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఆRohtih{#}Rohit Sharma;Ishan Kishan;West Indies;Sanju Samson;INTERNATIONAL;Yuva;BCCI;World Cupఅందుకే సంజుని తుది జట్టులో తీసుకోలేదు.. రోహిత్ క్లారిటీ?అందుకే సంజుని తుది జట్టులో తీసుకోలేదు.. రోహిత్ క్లారిటీ?Rohtih{#}Rohit Sharma;Ishan Kishan;West Indies;Sanju Samson;INTERNATIONAL;Yuva;BCCI;World CupSat, 29 Jul 2023 11:44:00 GMTటీమిండియా యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ విషయంలో గత కొంతకాలం నుంచి భారత సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో రాణించిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు అటు వెంటనే జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని కల్పిస్తున్న సెలెక్టర్లు ఎందుకో అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్న సంజు శాంసన్ ను మాత్రం జట్టులోకి తీసుకోవడం లేదు. ఒకవేళ సంజు శాంసన్ ను ఏదైనా పర్యటన కోసం సెలెక్ట్ చేసిన తుది జట్టులోకి మాత్రం ఎంపిక చేయడం లేదు అని చెప్పాలి.



 అయితే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లను తుది జట్టులో కొనసాగించి ఇక మంచి ఫామ్ కనబరుస్తున్న సంజు శాంసన్ ను సెలెక్ట్ చేయకపోవడం పై అటు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో మొదటి వన్డే మ్యాచ్లో తుది జట్టులో సంజు కనిపించకపోవడంతో మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే సంజు ని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదు అనే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. సంజు పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్న వివాదానికి తీరదించే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ.


 లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే సంజూ  శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోలేకపోయాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో ఎలాంటి సందేహాలు లేకుండా టీం కాంబినేషన్ ఎంచుకోవాలి అని అనుకుంటున్నాము అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక తొలి వన్డే మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ పై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ ఇచ్చిన  వివరణ పై అటు ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందలేదు. ఇలా కాంబినేషన్ పేరుతో చివరికి వరల్డ్ కప్ వరకు అతనికి అవకాశాలు ఇవ్వకుండా పూర్తిగా జట్టుకు దూరం చేయాలనే ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>