PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-nandyala-chandrbabu77f56f84-0e50-4f83-8c8f-f8b67fe5e4ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-nandyala-chandrbabu77f56f84-0e50-4f83-8c8f-f8b67fe5e4ac-415x250-IndiaHerald.jpgఇపుడు విషయం ఏమిటంటే నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన్, ఆధోని నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో సమీక్ష జరిపారు. పనిలోపనిగా మరికొందరు సీనియర్ నేతలను కూడా ఆహ్వానించారట. భూమా బ్రహ్మానందరెడ్డి, కేఈ ప్రతాప్, ఎన్ఎండీ ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి లాంటి సీనియర్లందరు పాల్గొన్నారు. భూమా అఖిలప్రియ మాత్రం కనబడలేదు. ఎందుకంటే అఖిలను సమావేశానికి పిలవలేదట. దీంతోనే అఖిల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటనేది అర్ధమవుతోంది. bhuma akhila nandyala chandrbabu{#}Bhuma Akhila Priya;Allagadda;Nandyala;CBN;Party;District;Newsరాయలసీమ : ఈ మాజీ మంత్రి కథ ముగిసినట్లేనా ?రాయలసీమ : ఈ మాజీ మంత్రి కథ ముగిసినట్లేనా ?bhuma akhila nandyala chandrbabu{#}Bhuma Akhila Priya;Allagadda;Nandyala;CBN;Party;District;NewsSat, 29 Jul 2023 05:00:00 GMT


మాజీమంత్రి భూమా అఖిలప్రియ కథ ముగిసినట్లే అనిపిస్తోంది. తెలుగుదేశంపార్టీలో ఆమె కంటిన్యు అవుతున్నారే కాని ఆమెను ఎవరూ పట్టించుకోవటంలేదు. జిల్లా నేతల్లో అత్యధికులు ఆమెకు దూరంగానే ఉంటున్నారు. ఆమె వ్యవహార శైలిని  ఏమాత్రం ఇష్టపడని సీనియర్లంతా ఆమెతో కలవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. వీళ్ళ వ్యవహారం ఇలాగుంటే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు ఆమెకు దూరమే. తాజాగా చంద్రబాబునాయుడు కూడా దూరంపెట్టేసినట్లు అర్ధమవుతోంది.





ఇపుడు విషయం ఏమిటంటే నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన్, ఆధోని నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో సమీక్ష జరిపారు. పనిలోపనిగా మరికొందరు సీనియర్ నేతలను కూడా ఆహ్వానించారట. భూమా బ్రహ్మానందరెడ్డి, కేఈ ప్రతాప్, ఎన్ఎండీ ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి లాంటి సీనియర్లందరు పాల్గొన్నారు. భూమా అఖిలప్రియ మాత్రం కనబడలేదు. ఎందుకంటే అఖిలను సమావేశానికి పిలవలేదట. దీంతోనే అఖిల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటనేది అర్ధమవుతోంది.





పార్టీ కార్యక్రమాలకు అఖిలను అందరు దూరంగా ఉంచుతున్నారు. తనను అందరు దూరంగా ఉంచుతున్నారని అఖిలకు తెలిసినా ఆమె మాత్రం దేన్ని పట్టించుకోవటంలేదు. విచిత్రం ఏమిటంటే పార్టీలో తనకు ఎంత వ్యతిరేకత ఉందో అంత వ్యతిరేకంగా ఆమె కూడా వ్యవహరిస్తున్నారు. సొంత నియోజకవర్గం ఆళ్ళగడ్డను వదిలేసి నంద్యాలలో క్యాంపు వేస్తున్నారు. దాంతో తిరగాల్సిన ఆళ్ళగడ్డలో తిరక్కుండా సంబంధంలేని నంద్యాలలో జోక్యం చేసుకోవటంతో రెండు నియోజకవర్గాల్లోని నేతలు గోల పెట్టేస్తున్నారు.





పైగా అఖిల మీద కిడ్నాపులు, దాడులు, హత్యాయత్నాలు, ఫోర్జరీలు, మోసాల్లాంటి అనేక కేసులున్నాయి. విచిత్రం ఏమిటంటే పార్టీలో ఆమెను చంద్రబాబుతో పాటు అందరు దూరంగా పెడుతున్నారు కానీ పార్టీ నుండి బయటకు పంపేస్తున్నట్లు మాత్రం ప్రకటించటంలేదు. కార్యక్రమాలకు పిలవరు, ఆమె వచ్చినా కలుపుకోరు, సమావేశాల సమాచారం ఇవ్వరు, వచ్చినా అనుమతించరు. అయినా పార్టీలో నుండి సాగనంపటంలేదు. ఒకవిధంగా ఆమె పరిస్ధితి పార్టీలో విచిత్రంగా ఉందంటే ఉంది లేదా దయనీయంగా ఉందంటే ఉంది. ఎవరినీ లెక్కచేయని తనమే చివరకు తనకు ఈ పరిస్ధితి తెచ్చిందని అఖిల ఇప్పటికీ గ్రహించటంలేదు.




RRR Telugu Movie Review Rating

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>