MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-9299988c-153a-47b9-b9bd-aa1736e7b54a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-9299988c-153a-47b9-b9bd-aa1736e7b54a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా అయన మేనల్లుడు యంగ్ హీరో సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవి తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు కూడా పూర్తయ్యాయి.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి బ్రో మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.మొత్తం 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే విందు భోజనంలా ఉండటం చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్.ఒరిజినల్ మూవీ వినోదాయ సిత్తం సినిమాతో పోల్చి చూస్తే కథ పరంగా స్వల్పంగా మార్పులుBRO {#}Kathanam;Comedy;thaman s;kalyan;Audience;Hero;Telugu;Cinemaబ్రో రివ్యూ: పక్కా ఫ్యాన్ స్టఫ్.. కానీ అవే మైనస్?బ్రో రివ్యూ: పక్కా ఫ్యాన్ స్టఫ్.. కానీ అవే మైనస్?BRO {#}Kathanam;Comedy;thaman s;kalyan;Audience;Hero;Telugu;CinemaFri, 28 Jul 2023 14:16:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా అయన మేనల్లుడు యంగ్ హీరో సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవి తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు కూడా పూర్తయ్యాయి.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి బ్రో మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.మొత్తం 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే విందు భోజనంలా ఉండటం చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్.ఒరిజినల్ మూవీ వినోదాయ సిత్తం సినిమాతో పోల్చి చూస్తే కథ పరంగా స్వల్పంగా మార్పులు చేయగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ లేవని సాయితేజ్ చెప్పినా కూడా మేకర్స్ మాత్రం తెలివిగా పొలిటికల్ డైలాగ్స్ ను పెట్టడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక సాంగ్స్ విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో పెద్దగా మెప్పించలేకపోయిన థమన్ బీజీఎం విషయంలో మాత్రం పర్వాలేదు అనిపించడం ప్లస్ పాయింట్ అయ్యింది.


ఇక పవన్ కళ్యాణ్, సాయితేజ్  నటన అయితే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ తో చేసిన ప్రయోగం బాగానే ఫలించింది. రన్ టైం తక్కువ ఉండటంతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమాను చూసిన అనుభవం ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్టాఫ్ లోని కొన్ని కామెడీ సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు సినిమా సక్సెస్ లో అవి చాలా కీలక పాత్ర పోషించాయి. ఓవర్సీస్ ఆడియన్స్ బ్రో మువీ ఖచ్చితంగా హిట్ బొమ్మ అని చెబుతున్నారు. కథ బాగానే ఉన్నా కథనం విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు ఉండటం, ఒరిజినల్ స్టోరీలో ఉన్న మంచి ఫీల్ ను ఈ సినిమాలో మిస్ చేయడం ఇంకా కథకు ఏ మాత్రం అవసరం లేని కొన్ని సీన్లకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మాత్రం బ్రో సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. ఇక కామన్ ఆడియన్స్ రియాక్షన్ ను బట్టి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిసైడ్ అవుతుంది. చిన్నచిన్న లోపాలు ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫ్యాన్ స్టఫ్ అనే చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>