PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeswari-bjp-jagan-modif8f6216d-ca8e-4dce-9db4-5057d2263734-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeswari-bjp-jagan-modif8f6216d-ca8e-4dce-9db4-5057d2263734-415x250-IndiaHerald.jpgనాలుగు రోజుల క్రితం పురదేశ్వరి రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులపై మాట్లాడుతు ఇప్పటివరకు రాష్ట్రానికి ఉన్న అప్పు అంటే 2023 జూన్ వరకు రు. 10. 77 లక్షల కోట్లుగా చెప్పారు. ఇందులో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అప్పులు సుమారు రు. 3.62 లక్షల కోట్లున్నట్లు చెప్పారు. అంటే నాలుగేళ్ళల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులే రు. 7.14 లక్షల కోట్లని చెప్పారు. ఈ అప్పులను ప్రభుత్వం ఏఏ రూపాల్లో చేశారో కూడా ఆమె వివరించారు. purandeswari bjp jagan modi{#}CBN;Venkatesh;Bharatiya Janata Party;Jagan;Andhra Pradesh;G Kishan Reddy;Industries;Government;Daggubati Venkateswara Rao;Daggubati Purandeswari;YCP;Khammam;June;March;Reddy;Air;Minister;central governmentఅమరావతి : పురందేశ్వరికి కేంద్రమే షాకిచ్చిందా ?అమరావతి : పురందేశ్వరికి కేంద్రమే షాకిచ్చిందా ?purandeswari bjp jagan modi{#}CBN;Venkatesh;Bharatiya Janata Party;Jagan;Andhra Pradesh;G Kishan Reddy;Industries;Government;Daggubati Venkateswara Rao;Daggubati Purandeswari;YCP;Khammam;June;March;Reddy;Air;Minister;central governmentThu, 27 Jul 2023 03:00:00 GMT


కేంద్రప్రభుత్వంలో శాఖలతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి సమన్వయం ఉన్నట్లు లేదు. ఎందుకంటే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఆమె అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్రప్రభుత్వమో లేకపోతే వైసీపీనో అనటంలేదు. స్వయంగా కేంద్రప్రభుత్వ శాఖలే చెబుతున్నాయి. అంటే పురందేశ్వరి ఆరోపణలను కేంద్రప్రభుత్వమే ఖండిస్తోందన్నమాట. దీంతో జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం జనాలకు అర్ధమైపోతోంది.





నాలుగు రోజుల క్రితం పురదేశ్వరి రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులపై మాట్లాడుతు ఇప్పటివరకు రాష్ట్రానికి ఉన్న అప్పు అంటే 2023 జూన్ వరకు రు. 10. 77 లక్షల కోట్లుగా చెప్పారు. ఇందులో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అప్పులు సుమారు రు. 3.62 లక్షల కోట్లున్నట్లు చెప్పారు. అంటే నాలుగేళ్ళల్లో  వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులే రు. 7.14 లక్షల కోట్లని చెప్పారు. ఈ అప్పులను ప్రభుత్వం ఏఏ రూపాల్లో చేశారో కూడా ఆమె వివరించారు.





సీన్ కట్ చేస్తే ఏపీ అప్పులపై తెలంగాణా ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు ప్రశ్నవేశారు. దానికి లోక్ సభలో ఆర్ధికశాఖ మంత్రి సమాధానమిస్తు 2023, మార్చి వరకు మొత్తం అప్పులు రు. 4.42 లక్షల కోట్లని చెప్పారు. చంద్రబాబు దిగిపోయేనాటికి చేసిన అప్పు రు. 2.64 లక్షల కోట్లు కూడా కలిసే ఉందని మంత్రి చెప్పారు. అంటే కేంద్రమంత్రి లోక్ సభలో ఇచ్చిన వివరాల ప్రకారం నాలుగేళ్ళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుడు సుమారు రు. 1. 78 లక్షలు మాత్రమే. మరి పురందేశ్వరి ఏ లెక్కల ఆధారంగా రు. 7.14 లక్షల కోట్లు అప్పని చెప్పారు. పురందేశ్వరి చెప్పింది నిజమా లేకపోతే కేంద్ర ఆర్ధికశాఖమంత్రి చెప్పిన లెక్కలు నిజమా ?





మొన్నటికి మొన్న కేంద్రం సాయం చేస్తున్నా జగన్ ప్రభుత్వం ఇళ్ళనిర్మాణం చేయటంలేదని మండిపోయారు. మరుసటి రోజే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతు ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 20 లక్షల ఇళ్ళు నిర్మించిందని ప్రకటించారు. ఏపీకి పెట్టుబడులు రావటంలేదని, పరిశ్రమలు రావటంలేదని, తరలి వెళ్ళిపోతున్నాయని పురందేశ్వరంటే ఆ లెక్కలు కూడా తప్పని కేంద్రం ప్రకటించిన వివరాలతో తేలిపోయింది. మొత్తానికి పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలన్నీ గాలి ఆరోపణలే అని కేంద్రమే స్వయంగా లెక్కలతో తేల్చి చెప్పేస్తోంది.




RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న "భోళా శంకర్" మూవీ ట్రైలర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>