HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health95b5e4f8-6568-4511-ab7b-ccb7fbf3e354-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health95b5e4f8-6568-4511-ab7b-ccb7fbf3e354-415x250-IndiaHerald.jpgమనం మాములుగా దోశలను మినపప్పు, బియ్యంతో తయారు చేసుకొని తింటూ ఉంటాము. ఈ విషయం మనందరికి తెలిసిందే. ఇంకా మినపప్పుతో పాటు మనం ఇతర పప్పు దినుసులను కలిపి కూడా రుచికరమైన దోశలను తయారు చేసుకోని తింటూ ఉంటాము.ఈ దోశలను తినడం వల్ల మనం రుచికి రుచిని ఇంకా అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ దోశలను తినడం వల్ల మనం మన శరీరానికి కావల్సినంత ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను కూడా అందించవచ్చు. అలాగే ఈ దోశలను తయారు చేసుకుని తినడం వల్ల ప్రోటీన్ లోపం అనేది రాకుండా ఉంటుంది.ఇక రుచిగా ఉండే ఈ ప్రోటీన్ దోశలను ఎలా తయారు చేసHEALTH{#}oil;cumin;salt;Gas Stove;Mixie;Hing;Curry leaves;Ginger;Manamఈ దోశ తింటే ఫిట్ గా అవుతారు?ఈ దోశ తింటే ఫిట్ గా అవుతారు?HEALTH{#}oil;cumin;salt;Gas Stove;Mixie;Hing;Curry leaves;Ginger;ManamTue, 25 Jul 2023 20:27:00 GMTమనం మాములుగా దోశలను మినపప్పు, బియ్యంతో తయారు చేసుకొని తింటూ ఉంటాము. ఈ విషయం మనందరికి తెలిసిందే. ఇంకా మినపప్పుతో పాటు మనం ఇతర పప్పు దినుసులను కలిపి కూడా రుచికరమైన దోశలను తయారు చేసుకోని తింటూ ఉంటాము.ఈ దోశలను తినడం వల్ల మనం రుచికి రుచిని ఇంకా అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ దోశలను తినడం వల్ల మనం మన శరీరానికి కావల్సినంత ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను కూడా అందించవచ్చు. అలాగే ఈ దోశలను తయారు చేసుకుని తినడం వల్ల ప్రోటీన్ లోపం అనేది రాకుండా ఉంటుంది.ఇక రుచిగా ఉండే ఈ ప్రోటీన్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రోటీన్ దోశ తయారు చెయ్యడానికి కావల్సిన పదార్థాలు..3 గంటల పాటు నానబెట్టిన కొర్రలు – ఒక కప్పు, 3 గంటల పాటు నానబెట్టిన పెసర్లు – గుప్పెడు, 3 గంటల పాటు నానబెట్టిన శనగలు – గుప్పెడు, 3 గంటల పాటు నానబెట్టిన మినపప్పు- గుప్పెడు ఇంకా 3 గంటల పాటు నానబెట్టిన బొబ్బర్లు – గుప్పెడు, మిరియాలు -ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం – ఒక ఇంచు ముక్క, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు స్పూన్, ఉప్పు – తగినంత తీసుకోవాలి.


ప్రోటీన్ దోశ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు జార్ లో కొర్రలు, పెసర్లు, శనగలు, మినపప్పు, బొబ్బర్లు, మిరియాలు, కరివేపాకు, అల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి కొంచెం వేడి చేయాలి. ఆ పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడవాలి. ఆ తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి.ఆ దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే దాకా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే ప్రోటీన్ దోశ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రోటీన్ దోశను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>