MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshc8188de6-86ef-4e4a-ac08-be074160a50b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshc8188de6-86ef-4e4a-ac08-be074160a50b-415x250-IndiaHerald.jpgఅందాల పోటీలలో బహుమతి గెలుచుకున్న చాలమంది బ్యూటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా రాణించాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వారి లిస్టులో మాజీ మిస్ ఇండియా హ‌రియానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలలో నటించి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి అని కొందరు అంటూ ఉంటారు.దీనికితోడు చాలామంది ప్రముఖ నిర్మాతలు అదేవిధంగా దర్శకులు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో ఆశక్తmahesh{#}Prize;trivikram srinivas;Gift;Yevaru;BEAUTY;Pooja Hegde;bollywood;Tollywood;varun tej;Hero;Heroine;Telugu;Cinema;India;Newsమీనాక్షి కి ఓటు వేసిన మహేష్ !మీనాక్షి కి ఓటు వేసిన మహేష్ !mahesh{#}Prize;trivikram srinivas;Gift;Yevaru;BEAUTY;Pooja Hegde;bollywood;Tollywood;varun tej;Hero;Heroine;Telugu;Cinema;India;NewsTue, 25 Jul 2023 09:00:00 GMTఅందాల పోటీలలో బహుమతి గెలుచుకున్న చాలమంది బ్యూటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా రాణించాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వారి లిస్టులో మాజీ మిస్ ఇండియా హ‌రియానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలలో నటించి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి అని కొందరు అంటూ ఉంటారు.


దీనికితోడు చాలామంది ప్రముఖ నిర్మాతలు అదేవిధంగా దర్శకులు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమెకు అవకాశాలు ఇచ్చే  విషయంలో ఆశక్తి  కనపరచడంలేదు అన్నవార్తలు కూడ ఉన్నాయి.  అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో శుశాంత్‌ తో క‌లిసి చేసిన ‘ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ తెలుగులో ఆమెకు తొలి సినిమా. ఆసినిమా ఫెయిల్ అయినప్పటికీ ఆమె ఆతరువాత నటించిన ‘ఖిలాడి’ ‘హిట్ 2’ సినిమాలతో ఆమెకు మంచి హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమెకు మహేష్ లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారంలో’ సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.


పూజా హెగ్డే స్థానంలో ఈమెకు హీరోయిన్ అవకాశం వచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈసినిమాలో ఈమె మెయిన్ హీరోయిన్ కాదు. అయితే పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలకు ప్రమోషన్ ఆమె స్థానంలో మీనాక్షీ ఎంపిక అయి ఉండవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ త్రివిక్రమ్మూవీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈమూవీ తరువాత మీనాక్షికి పూర్తి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.


అంతేకాదు వరుణ్ తేజ్ న్ విశ్వక్సేన్ ల కొత్త సినిమాలలో కూడ ఈమెకు అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమె ఇప్పటికే కాలీవుడ్ ఇండస్ట్రీలో కూడ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈమెకు పెద్దగా అవకాశాలు లేని పరిస్థితులలో ఈమె తెలివిగా టాలీవుడ్ కోలీవుడ్ ల వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో త్వరలో ఈమె బిజీ హీరోయిన్ గా మారే ఆస్కారం కనిపిస్తోంది..





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>