Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d89ddec-526a-4a37-8041-c1e21fff96aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d89ddec-526a-4a37-8041-c1e21fff96aa-415x250-IndiaHerald.jpgఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా బేబీ. జులై 14న విడుదలైన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది బేబీ సినిమా. ఇక ఈ సినిమాతో వైష్ణవి చైతన్య మరింత ఫాలోయింగ్ సంపాదించింది. హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా Tollywood{#}Blockbuster hit;Chaitanya;Anand Deverakonda;Success;Telangana;Director;Heroine;Cinemaబేబీ సినిమాలో హీరోయిన్ గా.. వైష్ణవిని అందుకే తీసుకున్నాం : డైరెక్టర్బేబీ సినిమాలో హీరోయిన్ గా.. వైష్ణవిని అందుకే తీసుకున్నాం : డైరెక్టర్Tollywood{#}Blockbuster hit;Chaitanya;Anand Deverakonda;Success;Telangana;Director;Heroine;CinemaTue, 25 Jul 2023 11:32:00 GMTఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా బేబీ. జులై 14న విడుదలైన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది బేబీ సినిమా. ఇక ఈ సినిమాతో వైష్ణవి చైతన్య మరింత ఫాలోయింగ్ సంపాదించింది. హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేయగా, విరాజ్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన బేబీ మరిన్ని కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా SKN నిర్మించారు. ఇప్పటికే బేబీ సినిమా టీం మొత్తం సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తాజాగా ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ కూడా అభినంద సభ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అభినందించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. అసలు ఈ సినిమాకి వైష్ణవిని ఎలా తీసుకున్నారో వివరించారు. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సాయి రాజేష్ మాట్లాడుతూ వైష్ణవిని బేబీ సినిమాలో తీసుకోడానికి ఒక కారణం ఉందని చెప్పారు. మేము బేబీ కథ అనుకున్నప్పుడు కచ్చితంగా ఈ సినిమాకి ఒక తెలంగాణ అమ్మాయి కావాలి అనుకున్నాం. తెలంగాణ భాష మీద కూడా పట్టు ఉండాలి, అప్పుడే బేబీ కథకి న్యాయం జరుగుతుంది అని అనుకున్నామని డైరెక్టర్ వివరించారు. ఆ సమయంలోనే మేనేజర్ వైష్ణవి ఫోటోని చూపించారని, వెంటనే వైష్ణవిని సంప్రదించామని తెలిపారు. అయితే కథ విన్న వైష్ణవి ముందు ఒప్పుకోలేదట. ఆ తరువాత డైరెక్టర్ ప్రతి సీన్ ని వివరించాక, ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ వేరే షాట్ తీస్తాను అని చెప్పడంతో వైష్ణవి బేబీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని డైరెకర్ చెప్పారు. ప్రతి సీన్ లో వైష్ణవి అద్భుతంగా నటించిందని, ఫ్యూచర్ లో ఆమె మంచి హీరోయిన్ అవుతుంది అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా 100 కోట్లు సాధించాలని కోరుకుంటున్నట్టు కూడా తెలిపారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>