PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeswari-bjp-kurnool-jagan-high-court6f916e32-b341-4c32-b059-556faa79008b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeswari-bjp-kurnool-jagan-high-court6f916e32-b341-4c32-b059-556faa79008b-415x250-IndiaHerald.jpgఈ విషయాలను పక్కనపెట్టేస్తే రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడుందని పురందేశ్వరి తాజాగా శెలవిచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని అప్పట్లో పార్టీ తీర్మానించింది. మరి ఆ తీర్మానానికి ఇపుడు పార్టీ కట్టుబడుందా ? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులన్నారు. న్యాయరాజధానిలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారు.purandeswari bjp kurnool jagan high court{#}Kanna Lakshminarayana;Proddatur;Daggubati Purandeswari;Rayalaseema;Kurnool;High court;Reddy;Jagan;Bharatiya Janata Party;Partyరాయలసీమ : కర్నూలులో హైకోర్టుకు ఓకే..జగన్ కు మద్దతేనా ?రాయలసీమ : కర్నూలులో హైకోర్టుకు ఓకే..జగన్ కు మద్దతేనా ?purandeswari bjp kurnool jagan high court{#}Kanna Lakshminarayana;Proddatur;Daggubati Purandeswari;Rayalaseema;Kurnool;High court;Reddy;Jagan;Bharatiya Janata Party;PartyTue, 25 Jul 2023 09:00:00 GMT


అధికార వికేంద్రీకరణకు సంబంధించి బీజేపీలో బాగా అయోమయం కనబడుతోంది. కొత్త అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి  ప్రొద్దుటూరు పార్టీ  సమావేశంలో మాట్లాడుతు కర్నూలు డిక్లరేషన్ కే పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాగే ప్రత్యేకహోదా విషయంలో కూడా కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ ఎక్కడా మాట తప్పలేదన్నారు. హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి ఎక్కువ సాయం అందించినట్లు ఆమె చెప్పారు. ఈమె మాటల్లోనే కేంద్రం మాట తప్పిన విషయం అర్ధమైపోతోంది.





ఎలాగంటే విభజనచట్టంలో ప్రత్యేకహోదా అని మాత్రమే ఉంది కానీ ప్రత్యేకప్యాకేజీ అని ఎక్కడా లేదు. ఒకవేళ హోదా కన్నా ప్యాకేజీ ద్వారానే ఎక్కువ సాయం అందించటం నిజమే అయితే మరేదో ప్రత్యేకహోదాను ఇచ్చేస్తే సరిపోయేది కదా. సరే ఆమె మాటల్లో డొల్లతనం ఇక్కడే బయటపడిపోతోంది. ప్రత్యేకహోదా అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు, ఆర్ధిక వెసులుబాట్లు చాలా ఉన్నాయి. ఈ విషయాలు ఇంతకుముందు ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలు అందుకున్న ప్రయోజనాలను గమనిస్తే అర్ధమవుతుంది. మరి ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికీ తెలీదు.






ఈ విషయాలను పక్కనపెట్టేస్తే రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడుందని పురందేశ్వరి తాజాగా శెలవిచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని అప్పట్లో పార్టీ తీర్మానించింది.  మరి ఆ తీర్మానానికి ఇపుడు పార్టీ కట్టుబడుందా ? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులన్నారు. న్యాయరాజధానిలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారు.





అంటే అప్పట్లో బీజేపీ తీర్మానించిందాన్నే ఇపుడు జగన్ ప్రతిపాదించారు. మరైతే ఇంతకాలం బీజేపీ ఎందుకు వ్యతిరేకించింది ? పురందేశ్వరికన్నా ముందు అద్యక్షులుగా పనిచేసిన సోమువీర్రాజు, కన్నాలక్ష్మీనారాయణ ఎక్కడ మాట్లాడినా అన్నీ అమరావతిలోనే ఉండాలనే డిమాండ్లు వినిపించేవారు. అన్నీ అంటే హైకోర్టు కూడా అనే అర్ధం. మరి పూర్వ అధ్యక్షులకు భిన్నమైన వాదనను పురందేశ్వరి వినిపిస్తున్నారు. పార్టీ లైనునే ఆమె వినిపించేట్లయితే మరి పూర్వ అధ్యక్షులు భిన్నంగా ఎందుకని డిమాండ్లు చేశారు ? జగన్ ప్రతిపాదనకు ఇపుడు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లేనా ? 













RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>