Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral650b4481-b0b1-4f3e-baae-7a54143b2db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral650b4481-b0b1-4f3e-baae-7a54143b2db6-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిన మనిషి.. కొన్ని పిచ్చి పనులకు బానిసగా కూడా మారిపోయాడు అని చెప్పాలి. ఇలా మనిషిని బానిసగా మార్చి ప్రమాదంలో పడేస్తున్న అలవాటు ఏదైనా ఉంది అంటే అది సెల్ఫీ పిచ్చి. ఇటీవల కాలంలో అధునాతన టెక్నాలజీతో కూడిన సెల్ఫోన్ లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఇక సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు కెమెరాలు అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే మంచి కెమెరా ఫ్యూచర్ లతో అటు స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ప్రతి క్షణాన్ని బంధించాలని జViral{#}March;twitter;Smart phone;Instagramప్రాణం తీసిన రీల్స్ మోజు.. చూస్తూ చూస్తుండగానే?ప్రాణం తీసిన రీల్స్ మోజు.. చూస్తూ చూస్తుండగానే?Viral{#}March;twitter;Smart phone;InstagramTue, 25 Jul 2023 09:18:00 GMTఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిన మనిషి.. కొన్ని పిచ్చి పనులకు బానిసగా కూడా మారిపోయాడు అని చెప్పాలి. ఇలా మనిషిని బానిసగా మార్చి ప్రమాదంలో పడేస్తున్న అలవాటు  ఏదైనా ఉంది అంటే అది సెల్ఫీ పిచ్చి. ఇటీవల కాలంలో అధునాతన టెక్నాలజీతో కూడిన సెల్ఫోన్ లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఇక సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు కెమెరాలు అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే మంచి కెమెరా ఫ్యూచర్ లతో అటు స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో  అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ప్రతి క్షణాన్ని బంధించాలని జనాలు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సెల్ఫీ పిచ్చితో చివరికి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుంటున్న పరిస్థితులు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.


 అయితే ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ.. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవాలని లేదా ఎక్కువ లైకులు కావాలి అంటూ ఆశపడుతున్న జనాలు చివరికి సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన వర్షాలు దంచి కొడుతున్నాయ్. ఈ వర్షాలు నేపథ్యంలో ఎక్కడికక్కడ జలపాతాలు పొంగిపొర్లుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక పర్యటకుల తాకిడి కూడా పెరిగింది. అయితే కొంతమంది జాగ్రత్తలు పాటిస్తూనే జలపాతాలను వీక్షిస్తూ.. ఉంటే ఇంకొంతమంది కాస్త అతి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


 ఇక్కడ జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకోవాలనుకున్న ఒక యువకుడి కోరిక చివరికి అతని ప్రాణం పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. కర్ణాటకలో యువకుడు శివమొగ్గలోని కొలురు సమీపంలో ఉన్న సిరిడిగండి జలపాతం వద్ద వీడియో తీసి instagram లో పోస్ట్ చేయాలి అనుకున్నాడు. అయితే అతను జలపాతం అంచున వెళ్లి నిలబడ్డాడు. కానీ పొరపాటున ఏకంగా అతని కాలుజారి జలపాతం లో పడిపోయాడు  కనీసం అతను జాడ కూడా దొరకలేదు  అధికారులు రంగంలోకి దిగి ఆచూకీ కోసం వెతికినా.  చివరికి అతను జాడ కనిపించలేదు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాక జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>