Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death335c6c54-b67e-42ee-b553-422655eb9315-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death335c6c54-b67e-42ee-b553-422655eb9315-415x250-IndiaHerald.jpgదేవుడు ఆడే వింత నాటకంలో మనుషులు జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ పెద్దలు ఊరికే చాదస్తం కొద్ది చెబుతూ ఉంటారు అని కొట్టిపారేసిన.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తే మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో విధి కొన్ని కొన్ని సార్లు కక్ష గట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. Death{#}kranthi kumar;santhanam;Punugulu;Sircilla;Parents;mandalam;Komaram Bheemవిధి ఆడిన నాటకం.. పునుగులు బాలుడి ప్రాణం తీసాయ్?విధి ఆడిన నాటకం.. పునుగులు బాలుడి ప్రాణం తీసాయ్?Death{#}kranthi kumar;santhanam;Punugulu;Sircilla;Parents;mandalam;Komaram BheemTue, 25 Jul 2023 09:30:00 GMTదేవుడు ఆడే వింత నాటకంలో మనుషులు జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ పెద్దలు ఊరికే చాదస్తం కొద్ది చెబుతూ ఉంటారు అని కొట్టిపారేసిన.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తే మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో విధి కొన్ని కొన్ని సార్లు కక్ష గట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది.


 దీంతో ఈ లోకాన్ని కూడా సరిగ్గా చూడని చిన్నారులు చివరికి ఈ లోకాన్ని విడిచిపోవడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు తెరమీదికి  వస్తూ ప్రతి ఒక్కరి ఒక్కరి హృదయాన్ని స్రవించిపోయేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అభం శుభం తెలియని ఆ చిన్నారి విషయంలో విధి పగబట్టినట్లుగానే వ్యవహరించింది. ఈ క్రమంలోనే 13 నెలల చిన్నారిని మృతి ఒడిలోకి చేర్చింది. తల్లిదండ్రులు చేసిన చిన్న పొరపాటు ఆ ఇంటి దీపం ఆరిపోయేలా చేసింది. చివరికి కడుపుకోతతో అరణ్య రోదన మిగిలే పరిస్థితిని తీసుకొచ్చింది.


 ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది. క్రాంతి కుమార్ అనే పదమూడు నెలల బాలుడు మృతి చెందాడు. గొంతులో పునుగులు ఇరుక్కోవడంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులు హుటహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. గొంతులో పునుగులు ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడలేదు. దీంతో అపస్మానిక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. కాగా కొమరం భీం జిల్లా కౌటాల మండలం వెల్డండి గ్రామానికి చెందిన మారుతి, కవితల సంతానం క్రాంతికుమార్. కాగా ఈ దంపతులు రెండేళ్ల నుంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>