DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/old8b0f0aa2-7f70-4163-aebf-0f46fe773cf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/old8b0f0aa2-7f70-4163-aebf-0f46fe773cf9-415x250-IndiaHerald.jpgగతంలో నాన్నకు పెళ్లి సినిమా వచ్చింది. కానీ అమ్మకు మళ్లీ పెళ్లి అనే సినిమా రాలేదు.. కానీ నిజ జీవితంలో సెలబ్రెటీల లైఫ్ లలో ఇలాంటివి జరిగిన సంఘటనలు బోలెడన్ని ఉన్నాయి. ఆ మధ్య సింగర్ సునీత ఇద్దరు పెరిగిన పిల్లలు ఉన్నా కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. దీనికి ఆమె కొడుకు దగ్గరుంచి మరీ పెళ్లి చేయించాడు. ఇలాంటి సంఘటనలు చాలా సినిమాల్లో వచ్చేవి. ఒంటరిగా ఉన్న మహిళలు కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆమెను ఎవరూ చూసుకునే వారు ఉండరని తెలిసి ఆమెకు పెళ్లి చేయాలని అనుకోవడం, తీరా పెళ్లి చేసిన తర్వాత అతను OLD{#}Cigarette;marriage;Athadu;Cinema;Girlమా అమ్మకు పెళ్లి.. వరుడు కావాలి!మా అమ్మకు పెళ్లి.. వరుడు కావాలి!OLD{#}Cigarette;marriage;Athadu;Cinema;GirlTue, 25 Jul 2023 13:00:00 GMTగతంలో నాన్నకు పెళ్లి సినిమా వచ్చింది. కానీ అమ్మకు మళ్లీ పెళ్లి అనే సినిమా రాలేదు.. కానీ నిజ జీవితంలో సెలబ్రెటీల లైఫ్ లలో ఇలాంటివి జరిగిన సంఘటనలు బోలెడన్ని ఉన్నాయి. ఆ మధ్య సింగర్ సునీత ఇద్దరు పెరిగిన పిల్లలు ఉన్నా కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. దీనికి ఆమె కొడుకు దగ్గరుంచి మరీ పెళ్లి చేయించాడు.


ఇలాంటి సంఘటనలు చాలా సినిమాల్లో వచ్చేవి. ఒంటరిగా ఉన్న మహిళలు కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆమెను ఎవరూ చూసుకునే వారు ఉండరని తెలిసి ఆమెకు పెళ్లి చేయాలని అనుకోవడం, తీరా పెళ్లి చేసిన తర్వాత అతను సరిగా చూసుకోకపోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని జీవితాలు బాగు పడినా మరి కొన్ని జీవితాలు గతంలో మాదిరిగానే మారిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు.


ప్రస్తుతం మా అమ్మకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అస్తా శర్మ అనే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో తన తల్లితో దిగిన సెల్పీని పోస్టు చేసింది. అందులో అబ్బాయికి కావాల్సిన అన్ని గుణ గణాలను కూడా పోస్టు చేసింది. ముఖ్యంగా అతడికి మందు, సిగరెట్ అలవాటు ఉండకూడదని చెప్పింది. మరో విషయం అతడు నాన్ వెజ్ తినకూడదు. వెజిటెరియన్ అయి ఉండాలి. వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండాలి. మా అమ్మను బాగా చూసుకోవాలి అని రాసుకొచ్చింది.


అయితే ఇలా సోషల్ మీడియాలో ఒక కూతురు తన తల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నవిషయం చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగించినా అది నిజమైంది. కూతురు తన తల్లికి పెళ్లి చేయాలని చెప్పిన విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ యువతి మాత్రం నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మా అమ్మ ఒంటరిగా ఉండటం కంటే ఒకరి తోడు కచ్చితంగా అవసరమని చెబుతోంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>