EducationPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/drdo43328581-bfad-406d-99cb-72ed6f0e50aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/drdo43328581-bfad-406d-99cb-72ed6f0e50aa-415x250-IndiaHerald.jpgడిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను ఓపెన్ చేసి rac.gov.inఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో మొత్తం పోస్టులు 55 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.ఇక ఇప్పటికే దరDRDO{#}Good news;Application;Good Newwz;DegreeDRDO: బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు?DRDO: బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు?DRDO{#}Good news;Application;Good Newwz;DegreeTue, 25 Jul 2023 14:27:01 GMTడిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను ఓపెన్ చేసి rac.gov.inఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో మొత్తం పోస్టులు 55 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.ఇక ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే..జనరల్, OBC ఇంకా EWS పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100. SC/ST/PWD ఇంకా మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


 అర్హతల విషయానికి వస్తే..సంబంధిత విభాగంలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్, సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వయస్సు విషయానికి వస్తే..ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'F' ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు మాత్రం 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'ఈ'కి గరిష్ట వయస్సు 50 ఏళ్లు మించకూడదు.అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'డి'కి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'సి'కి గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు ఉండాలి.ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'B'కి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే ముందుగా DRDO అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ని సందర్శించండి.ఇక ఆ తర్వాత హోమ్‌పేజీలో అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 146 కింద అప్లై లింక్‌పై క్లిక్ చేయండి.తరువాత దరఖాస్తు ఫారమ్ ని నింపండి.ఇక ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.ఇక ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించి.. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ ని తీసుకోండి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>