Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimefc596d20-e0a9-49d0-945b-ffdd457e2115-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimefc596d20-e0a9-49d0-945b-ffdd457e2115-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువగానే ఉంది. ఎంతలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసిన.. అటు దొంగలు మాత్రం ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే యజమానులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇలా చోరీలు చేయడానికి వచ్చిన వారు అందిన కాడికి దోచుకుపోతున్నారు. అంతేకాదు పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా వదలకుండా సవాలు విసురుతూ ఉన్నారు అని చెప్పాలీ. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు ఇళ్లల్లోకి చోరీలకు వెళ్ళిన దొంగలు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం Crime{#}rohini;job;Thief;Capitalభలే దొంగలు.. చోరీకి వచ్చి రూ. 500 వదిలి వెళ్లారు?భలే దొంగలు.. చోరీకి వచ్చి రూ. 500 వదిలి వెళ్లారు?Crime{#}rohini;job;Thief;CapitalMon, 24 Jul 2023 10:00:00 GMTఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువగానే ఉంది. ఎంతలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసిన.. అటు దొంగలు మాత్రం ఎంతో చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే యజమానులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇలా చోరీలు చేయడానికి వచ్చిన వారు అందిన కాడికి దోచుకుపోతున్నారు. అంతేకాదు పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా వదలకుండా సవాలు విసురుతూ ఉన్నారు అని చెప్పాలీ.


 అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు ఇళ్లల్లోకి చోరీలకు వెళ్ళిన దొంగలు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా దొంగలు ఎంతో కష్టపడి ఇంట్లోకి చొరబడ్డారు అంటే చాలు విలువైన వస్తువులు దొరక్కపోతే కనీసం ఏదో ఒకటి ఎత్తుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దొంగలు అలా చేయలేదు. ఏం వస్తువులు దొరకపోవడంతో అయ్యో పాపం అని ఏకంగా 500 రూపాయలు అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ ఘటన కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 రోహిణి ప్రాంతంలో ఉండే ఒక టెక్కి ఇంటి డోర్ బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతికారు  కానీ ఏమీ దొరకలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగలు వెళుతూ వెళుతూ ఇంటి గుమ్మం వద్ద 500 రూపాయలు వదిలి వెళ్లారు. అయితే జాబ్ ముగించుకుని ఇంటికి వచ్చిన టెక్కి డోర్ బద్దలు కొట్టి ఉండడం.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా  పడి ఉండడం.. ఇక అదే సమయంలో ఇక డోర్ వద్ద 500 రూపాయల నోటు కనిపించడంతో దొంగలు పడ్డారు అనే గ్రహించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగలు ఇలా ఏమి ఎత్తుకెళ్లకపోగా.  500 రూపాయలు వదిలి వెళ్ళడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>