DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kishan-reddyb268f317-c424-49ca-922f-0170610a90cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kishan-reddyb268f317-c424-49ca-922f-0170610a90cd-415x250-IndiaHerald.jpgబండి సంజయ్ స్టార్ట్ చేసిన సెంటిమెంట్ ను కిషన్ రెడ్డి కూడా కొనసాగించారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ టెంపుల్ ను సందర్శించి పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే బండి సంజయ్ తరహాలోనే కిషన్ రెడ్డి కూడా భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్దకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం నాంపల్లిలో ని బీజేపీ ఆఫీసులోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. గతంలో బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ముఖ్యంగా కావాలనే బండి సంజయ్ భాగ్యలక్ష్KISHAN REDDY{#}G Kishan Reddy;MIM Party;Gharshana;Hyderabad;Bharatiya Janata Party;Partyసెంటిమెంట్‌: ఆ అమ్మోరు బీజేపీని కాపాడుతుందా?సెంటిమెంట్‌: ఆ అమ్మోరు బీజేపీని కాపాడుతుందా?KISHAN REDDY{#}G Kishan Reddy;MIM Party;Gharshana;Hyderabad;Bharatiya Janata Party;PartyMon, 24 Jul 2023 23:00:00 GMTబండి సంజయ్ స్టార్ట్ చేసిన సెంటిమెంట్ ను కిషన్ రెడ్డి కూడా కొనసాగించారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ టెంపుల్ ను సందర్శించి పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే బండి సంజయ్ తరహాలోనే కిషన్ రెడ్డి కూడా భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్దకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం నాంపల్లిలో ని బీజేపీ ఆఫీసులోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.


గతంలో బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ముఖ్యంగా కావాలనే బండి సంజయ్ భాగ్యలక్ష్మీ టంపుల్ వద్దకు వెళ్లి ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారని ప్రచారం చేశాయి. కానీ ఆ విమర్శలు బీజేపీకే ప్లస్ అయ్యాయి. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది.


దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించింది. చివరకు మునుగోడు లో కూడా ఓటింగ్ శాతం పెంచుకుంది. అక్కడ ఏ మాత్రం బీజేపీ లేని స్థాయి నుంచి  లక్షకు పైగా ఓట్లు సాధించారంటే బీజేపీ ఎలా పుంజుకుందో అందరికీ తెలిసిందే. బీజేపీ నాయకులు సహజ సిద్ధంగా హైదరాబాద్ వస్తే భాగ్యలక్ష్మీ టెంపుల్ ను సందర్శించడం రివాజుగా మారింది.  అమ్మవారి ఆలయంకు రావాలంటే వేరే పార్టీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పే విధంగా పర్యటించారు.


దీనిపై మొదట్లో ఎంఐఎం పార్టీ రాద్దాంతం చేసిన కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా గతంలో విమర్శలు చేసేది. కానీ బీఆర్ఎస్ కూడా బీజేపీపై పెద్దగా ఆరోపణలు చేయడం లేదు. దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనేది తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీపై విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ కి పూర్తిగా బలం చేకూరుతుంది. కాబట్టి పరోక్షంగా బలవంతుడిగా చేయడం కంటే మౌనంగా ఉండి దాన్ని దెబ్బతీసే పార్ములా పాటిస్తుంది.



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తో ఎప్పటికి సినిమా చేయనంటున్న డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>