PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-viveka-cbi-yellow-media126998a8-7db6-4710-9ed4-52d0bfda1e4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-viveka-cbi-yellow-media126998a8-7db6-4710-9ed4-52d0bfda1e4a-415x250-IndiaHerald.jpgహత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రే కీలకమని నిరూపించటమే ఎల్లోమీడియా టార్గెట్. హత్యచేసింది ఎవరో తెలిసిపోయింది కాబట్టి చేయించింది అవినాషే అని నిరూపించటమే ఎల్లోమీడియా ఉద్దేశ్యం. ఎల్లోమీడియా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తోందంటే చంద్రబాబునాయుడు కోసమని అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో వివేకాహత్యకేసులో జగన్ పాత్రుందని నిరూపించి లబ్దిపొందాలన్న టార్గెట్ స్పష్టంగా కనబడుతోంది. అసలు వివేకా స్ధాయి ఎంత ? వివేకా హత్యకేసును జగన్ మెడకు చుట్టేయాలన్నది చంద్రబాబు, ఎల్లోమీడియా ఉద్దేశ్యం. jagan viveka cbi yellow media{#}bharathi old;kadapa;YCP;Murder.;Y S Vivekananda Reddy;CBI;devineni avinash;Jagan;Newsఅమరావతి : వివేకా కేసును మీడియానే కంపుచేసేసిందా ?అమరావతి : వివేకా కేసును మీడియానే కంపుచేసేసిందా ?jagan viveka cbi yellow media{#}bharathi old;kadapa;YCP;Murder.;Y S Vivekananda Reddy;CBI;devineni avinash;Jagan;NewsMon, 24 Jul 2023 05:00:00 GMT


వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు  గందరగోళంగా తయారైంది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఇంత కాంప్లికేటెడ్ అవటానికి మీడియానే కారణమని చెప్పాలి.  హత్యకేసు విచారణను పోలీసులు, సిట్ లేదా సీబీఐ వాటిపాటికి వాటిని దర్యాప్తు చేసుకోనిచ్చుంటే సరిపోయేది. అలా చేయకుండా దర్యాప్తు సంస్ధలకు ప్యారలల్ గా ఎల్లోమీడియా కూడా దర్యాప్తు చేసేస్తోంది. తమ దర్యాప్తును నిష్పక్షపాతంగా కాకుండా జగన్మోహన్ రెడ్డే సూత్రదారుడు లేదా కీలక పాత్రదారుడని నిరూపించటమే ఎల్లోమీడియా ముఖ్య ఉద్దేశ్యం.





హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రే కీలకమని నిరూపించటమే ఎల్లోమీడియా టార్గెట్. హత్యచేసింది ఎవరో తెలిసిపోయింది కాబట్టి చేయించింది అవినాషే అని నిరూపించటమే ఎల్లోమీడియా ఉద్దేశ్యం. ఎల్లోమీడియా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తోందంటే చంద్రబాబునాయుడు కోసమని అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో వివేకాహత్యకేసులో జగన్ పాత్రుందని నిరూపించి లబ్దిపొందాలన్న టార్గెట్ స్పష్టంగా కనబడుతోంది. అసలు వివేకా స్ధాయి ఎంత ? వివేకా హత్యకేసును జగన్ మెడకు చుట్టేయాలన్నది చంద్రబాబు, ఎల్లోమీడియా ఉద్దేశ్యం.





హత్యకేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్ ప్రమేయంపై సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినా సరే జగన్ పాత్రుంది, భారత పాత్రుందని పదేపదే కథనాలు, వార్తలు అచ్చేస్తున్నది. నిజంగానే హత్యలో జగన్ లేదా భారతి పాత్రుంటే ఆ విషయాన్ని సీబీఐ ఆధారాలతో సహా చూపించాలి. అప్పుడు తాము రాసుకునేది రాసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు.





అలాకాకుండా వివేకా హత్య వెనుక జగన్, అవినాషే ఉన్నారని నిరూపించాలన్నది ఎల్లోమీడియా తాపత్రయం. అందుకనే వివేకా చనిపోయిన విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పిన టైంను పట్టుకుని కూడా నానా యాగీ చేస్తోంది. వివేకా మరణాన్ని జగన్ కు అవినాష్ ఎన్నిగంటలకు చెబితే ఏముంది ? చెప్పినపుడు జగన్ తో పాటు ఎవరుంటే ఏమిటి ?  ఎలాగైనా వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకూడదన్నదే ఏకైక టార్గెట్ గా పెట్టుకున్నది ఎల్లోమీడియా. ఇందులో భాగంగా ఎంతచిన్న అవకాశం దొరికినా సరే జగన్ పై బురదచల్లేయటమే. ఇలాంటి విపరీత ధోరణి వల్లే వివేకా హత్యకేసు విచారణ బాగా కంపైపోయింది.




RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం అల్లుఅర్జున్...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>