Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/accident66788618-1bef-4a7e-bf4d-d1bf94188914-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/accident66788618-1bef-4a7e-bf4d-d1bf94188914-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చాక, ఎక్కడ జరిగిన విషయాలైనా తేలిగ్గా చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో అనేక వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు ఈమధ్య ఎక్కువగా వైరల్ కావడం మనం గమనించవచ్చు. అవును, వీధుల్లో ఉండే పశువులు రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండి దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఒక ఎద్దుకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అవును, నడిరోడ్డుపై ఎద్దులు రెచ్చిపోతున్నాయి. సడెనAccident{#}Bike;Capital;Manam;mediaవైరల్: రోడ్డుపై నడుస్తూనే రెంకెలేసిన ఎద్దు... తల్లీకొడుకులను ఎలా కుమ్మి పడేసిందో చూడండి?వైరల్: రోడ్డుపై నడుస్తూనే రెంకెలేసిన ఎద్దు... తల్లీకొడుకులను ఎలా కుమ్మి పడేసిందో చూడండి?Accident{#}Bike;Capital;Manam;mediaMon, 24 Jul 2023 13:06:00 GMTసోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చాక, ఎక్కడ జరిగిన విషయాలైనా తేలిగ్గా చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో అనేక వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు ఈమధ్య ఎక్కువగా వైరల్ కావడం మనం గమనించవచ్చు. అవును, వీధుల్లో ఉండే పశువులు రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండి దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఒక ఎద్దుకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అవును, నడిరోడ్డుపై ఎద్దులు రెచ్చిపోతున్నాయి. సడెన్ గా అటాక్ చేస్తున్నాయి.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగిపోయింది. ఓ ఎద్దు రెచ్చిపోతూ బైక్ పై వెళ్తున్న తల్లీ కొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, అది ఈస్ట్ ఢిల్లీలోని గీతా కాలనీ ఏరియా. ఆ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. వాహనదారులు అటుఇటు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతలో ఓ బైక్ పై తల్లి, కొడుకు వచ్చారు. వారికి రోడ్డుపై సడెన్ గా ఓ ఎద్దు కనిపించింది. దీంతో ఆమె బైక్ ను స్లో చేసింది. ఎద్దు వెళ్లిపోయాక ముందుకెళ్లొచ్చని భావించింది. కానీ, అంతలోనే దారుణం జరిగింది. ఊహించని విధంగా సడెన్ గా ఎద్దు వారిపై దాడికి దిగింది. కొమ్ములతో పొడిచేసింది. ఈ దాడిలో బైక్ పై నుంచి తల్లీ కొడుకులు రోడ్డు మీదకు పడిపోయారు.

అయినా ఎద్దు వారిపై దాడిచేయడం ఆపలేదు. ఇది గమనించిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. ఎద్దుని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. రాళ్లు, కర్రలతో దాన్ని తరమాలని చూశారు. కానీ, ఎద్దు దాడి ఆపలేదు. మహిళను ఆమె కొడుకుపై దాడిచేస్తూనే ఉంది. అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడి చేసింది. అలా కాసేపు ఎద్దు బీభత్సం కొనసాగించి, చివరికి అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎద్దు దాడిలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎద్దు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నెటిజన్లు ఇలా పశువులు విచ్చలవిడిగా రోడ్డు మీద తిరక్కుండా, దాడులకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>