Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhubaneswar-0a2a3fc4-9be4-47bb-a40e-e16c80c08315-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhubaneswar-0a2a3fc4-9be4-47bb-a40e-e16c80c08315-415x250-IndiaHerald.jpgఇప్పుడు టీం ఇండియా పేస్ బౌలింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది బుమ్రా, సిరాజ్, అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్. కానీ కొన్నేళ్ల క్రితం వరకు పేస్ బౌలింగ్ అంటే గుర్తొచ్చే పేరు భువనేశ్వర్ కుమార్. అరంగేట్ర మ్యాచ్ తోనే అందరిని ఆశ్చర్యపరిచే బౌలింగ్ వేసి తక్కువ టైం లోనే అన్ని ఫార్మాట్ లలో కీలక బౌలర్ గా మారాడు. కానీ కొన్నేళ్లుగా భువి కెరీర్ రివర్స్ అవుతుంది అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఏ ఫార్మాట్ లో కనిపించట్లేదు. జనవరి 2022లో ఆఖరి వన్డే ఆడాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన భువి ఆ తరువాత కనిపించలేదBhubaneswar.{#}Mohit Sharma;ICC T20;January;Hyderabad;Indiaమూడు ఫార్మాట్లలోనూ కనిపించని భువనేశ్వర్.. ఏం అయ్యింది?మూడు ఫార్మాట్లలోనూ కనిపించని భువనేశ్వర్.. ఏం అయ్యింది?Bhubaneswar.{#}Mohit Sharma;ICC T20;January;Hyderabad;IndiaMon, 24 Jul 2023 17:00:00 GMTఇప్పుడు టీం ఇండియా పేస్ బౌలింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది బుమ్రా, సిరాజ్, అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్. కానీ కొన్నేళ్ల క్రితం వరకు పేస్ బౌలింగ్ అంటే గుర్తొచ్చే పేరు భువనేశ్వర్ కుమార్. అరంగేట్ర మ్యాచ్ తోనే అందరిని ఆశ్చర్యపరిచే బౌలింగ్ వేసి తక్కువ టైం లోనే అన్ని ఫార్మాట్ లలో కీలక బౌలర్ గా మారాడు. కానీ కొన్నేళ్లుగా భువి కెరీర్ రివర్స్ అవుతుంది అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఏ ఫార్మాట్ లో కనిపించట్లేదు. జనవరి 2022లో ఆఖరి వన్డే ఆడాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన భువి ఆ తరువాత కనిపించలేదు. ఐపిఎల్ లో మాత్రమే హైదరాబాద్ తరపున ఆడాడు.

మూడు ఫార్మాట్ లలో కనిపించని భువి మళ్ళీ టీంలోకి వస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన భువి ఐపిఎల్ లో కూడా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు భువనేశ్వర్  21 టెస్టులు, 121 వన్డేలు, 77 టీ20 మ్యాచులు ఆడాడు. అంతేకాదు బౌలర్ గానే కాదు బ్యాటింగ్ లో కూడా భువి అదరగొడతాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్ వేయడంలో భువి స్పెషలిస్ట్. చివరి ఓవర్ లలో యార్కర్ బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతుంటాడు. టీం ఇండియా విజయాల్లో భువి కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో అత్యంత కీలకమైన 19వ ఓవర్ వేసి, 9-10 పరుగులను కూడా కట్టడి చేసిన భువి అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే భువి రీ ఎంట్రీ ఇచ్చాక భువి బౌలింగ్ లో మార్పులు వచ్చాయి. వికెట్ లు తీయడం లేదు, పరుగులు కూడా ఎక్కువ ఇచ్చేయడంతో భువి టీం ఇండియాకు దూరం అయ్యాడు.

ఇప్పుడు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి జట్టును త్వరలోనే ప్రకటిస్తారు. మరి ఈ సిరీస్ లో అయినా భువికి ఛాన్స్ వస్తుందో, లేదో చూడాలి. ఐపిఎల్ లో అంతగా రాణించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. భువితో పాటు మోహిత్ శర్మ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజా ఐపిఎల్ మోహిత్ పర్వాలేదనిపించాడు. ఇక వీరికి ఈ సిరీస్ లో కూడా అవకాశం రాకపోతే మళ్ళీ వీళ్ళని ఐపిఎల్ లోనే చూడాల్సి వస్తుందేమో. ఈ ఇద్దరికీ ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు జట్టులో స్థానం కోల్పోతే మళ్ళీ టీం ఇండియాలోకి రావడం అనుమానమే.



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>