MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony9078b6b1-6ec5-44d8-b5ca-4e6f28d8f7c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony9078b6b1-6ec5-44d8-b5ca-4e6f28d8f7c0-415x250-IndiaHerald.jpgనేడు తమిళ టాలెంటెడ్ నటుడు ఇంకా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈయన భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్ ఇంకా చిత్ర నిర్మాత. విజయ్ ఆంటోనీ మొదట తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 2005 వ సంవత్సరంలో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఇక భారత దేశ ఉత్తమ సంగీత విభాగంలో ఒకటైన "నాక ముక్క" అనే మాస్ పాటతో 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్ ఆంటోనీ. ఈ పాట ద్వారా ఆయన VIJAY ANTONY{#}vijay antony;Writer;Joseph Vijay;Audio;Bharateeyudu;Cricket;Chitram;Sangeetha;Thriller;Mass;Tamil;Telugu;Cinema;engineer;Father;Directorటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ బర్త్ డే స్పెషల్?టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ బర్త్ డే స్పెషల్?VIJAY ANTONY{#}vijay antony;Writer;Joseph Vijay;Audio;Bharateeyudu;Cricket;Chitram;Sangeetha;Thriller;Mass;Tamil;Telugu;Cinema;engineer;Father;DirectorMon, 24 Jul 2023 17:04:00 GMTనేడు తమిళ టాలెంటెడ్ నటుడు ఇంకా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈయన భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్ ఇంకా చిత్ర నిర్మాత. విజయ్ ఆంటోనీ మొదట తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 2005 వ సంవత్సరంలో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఇక భారత దేశ ఉత్తమ సంగీత విభాగంలో ఒకటైన "నాక ముక్క" అనే మాస్  పాటతో  2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్ ఆంటోనీ. ఈ పాట ద్వారా ఆయన మంచి గుర్తింపు పొందాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఈ పాటని ప్రదర్శించడం జరిగింది. ఇక విజయ్ ఆంటోనీ  తొలి చిత్రం 2012 లో "నాన్" అయినప్పటికీ  సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలకు గాను తెలుగు తమిళ భాషల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.


విజయ్ ఆంటోనీ బాల్యం విషయానికి వస్తే.. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో 1975 జూలై 24న ఈయన జన్మించాడు. ఆయన చిన్న వయసులోనే తండ్రి మరణించారు. ఆయన తండ్రి మరణించేనాటికి విజయ్ వయస్సు ఏడు సంవత్సరాలు. ఇంకా సోదరి వయస్సు నాలుగు సంవత్సరాలు.అందువలన చిన్న తనంలోనే విజయ్ ఆంటోనీ కుటుంబం కష్టాలకు గురి అయింది.ఆయన తల్లి పిల్లలకు విద్యను అందించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టింది.ఇక విజయ్ లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు.


 విజయ్ ఆంటోనీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. విజయ్ ఆంటోనీ తమిళ కవి , సమాజ సేవకుడు, సివిల్ సర్వంట్, "ప్రతాప ముదలియార్ చరిత్రం" రచయిత అయిన శామ్యూల్ వేదనాయగం పిళ్ళై మనవడు.విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే చాలా పెద్ద హిట్ అయ్యింది.అప్పటినుండి తన ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.లాస్ట్ టైం "బిచ్చగాడు 2" సినిమాతో హిట్టు కొట్టిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు "హత్యా" అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>