PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-is-aggressive-about-the-ap-team-in-ipl946fe61b-71a1-4a4a-a3d7-babaac1a7cba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-is-aggressive-about-the-ap-team-in-ipl946fe61b-71a1-4a4a-a3d7-babaac1a7cba-415x250-IndiaHerald.jpgరాజకీయంగా జగన్ పై కుట్రలు చేస్తున్న వాళ్ళని, గతంలో ఇబ్బందులు పెట్టిన కమ్మనేతలు తమంతట తాముగా ఎందులో అయినా ఇరుక్కుంటే మాత్రమే ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ప్రభుత్వం తనంతట తానుగా ఏ కమ్మోరి జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. చంద్రబాబునాయుడు, రామోజీరావు లాంటి వాళ్ళు కూడా అవినీతి, మోసాలు, అక్రమాల్లో ఇరుక్కుంటేనే కేసులు నమోదై విచారణ జరుగుతోంది. దూళిపాళ్ళ నరేంద్ర, దేవినేని ఉమ, డాక్టర్ రమేష్, ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళంతా ఏవో కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. jagan kamma lokesh chndrababu{#}ramoji rao;Kamma;Prakasam;TDP;AB Venkateswararao;devineni avinash;Janasena;Doctor;Lokesh;Lokesh Kanagaraj;Jagan;Pawan Kalyan;Reddy;Party;Government;Industriesఅమరావతి : జగన్ కమ్మోరిని నిజంగానే టార్గెట్ చేశారా ?అమరావతి : జగన్ కమ్మోరిని నిజంగానే టార్గెట్ చేశారా ?jagan kamma lokesh chndrababu{#}ramoji rao;Kamma;Prakasam;TDP;AB Venkateswararao;devineni avinash;Janasena;Doctor;Lokesh;Lokesh Kanagaraj;Jagan;Pawan Kalyan;Reddy;Party;Government;IndustriesSun, 23 Jul 2023 07:00:00 GMT




జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మ సామాజికర్గాన్ని నిజంగానే టార్గెట్ చేసిందా ? చేసిందనే అంటున్నారు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోకి ప్రవేశించిన లోకేష్ మాట్లాడుతు హిట్లర్ యూదులను టార్గెట్ చేసినట్లుగానే జగన్ కమ్మవాళ్ళని టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. ఒక్క కమ్మవాళ్ళనే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కూడా టార్గెట్ చేసినట్లు మండిపడ్డారు. ఇంతకీ లోకేష్  ఈ వ్యాఖ్యలు ఎక్కడా చేశారు.





ఎక్కడంటే కనిగిరిలో కమ్మ సామాజికవర్గం నేతల సమావేశంలో. సరే సామాజికవర్గాలతో జరిగిన సమావేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. అయితే నిజంగానే లోకేష్ చెప్పినట్లుగా జగన్ కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ప్రత్యేకించి ఒక సామాజికవర్గాన్ని ఏ పార్టీ అధినేత కూడా టార్గెట్ చేయరు. కాబట్టి జగన్ కూడా కమ్మోరిని టార్గెట్ చేసిందేమీలేదు. నిజంగానే కమ్మసామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేసుంటే ఇంతమంది కమ్మోరు ఏపీలో వ్యాపారాలు, పరిశ్రమలు నడపటం సాధ్యమయ్యేదేనా ?





రాజకీయంగా జగన్ పై కుట్రలు చేస్తున్న వాళ్ళని, గతంలో ఇబ్బందులు పెట్టిన కమ్మనేతలు తమంతట తాముగా ఎందులో అయినా ఇరుక్కుంటే మాత్రమే ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ప్రభుత్వం తనంతట తానుగా ఏ కమ్మోరి జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. చంద్రబాబునాయుడు, రామోజీరావు లాంటి వాళ్ళు కూడా అవినీతి, మోసాలు, అక్రమాల్లో ఇరుక్కుంటేనే కేసులు నమోదై విచారణ జరుగుతోంది. దూళిపాళ్ళ నరేంద్ర, దేవినేని ఉమ, డాక్టర్ రమేష్, ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళంతా ఏవో కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే.





అంతేకానీ ప్రత్యేకించి కమ్మసామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేసినట్లు ఎక్కడా కనిపించటంలేదు. గతంలో కూడా ఇదే ఆరోపణలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసేవారు. కమ్మ సామిజికవర్గం వాళ్ళని జగన్ రాష్ట్రం నుండి తిరిమేస్తున్నట్లు అప్పట్లో పవన్ పదేపదే ఆరోపించారు. కానీ ఏ కమ్మ ప్రముఖులు జగన్ కారణంగా రాష్ట్రం నుండి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించలేదు. తమను ఎన్నికల్లో ఘోరంగా ఓడించారన్న కసితో మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో అన్న భయంతో మాత్రమే కొందరు కమ్మ ప్రముఖులు జగన్ పైన దుష్ప్రచారం చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.




RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>