EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ramoji450af741-e829-47be-b83b-2bb16af8d22a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ramoji450af741-e829-47be-b83b-2bb16af8d22a-415x250-IndiaHerald.jpgమార్గదర్శి చిట్ పండ్ ఫైనాన్స్ కు సంబంధించిన కేసులో రామోజీ రావు దిగరాక తప్పలేదని తెలుస్తోంది. డిపాజిటర్ల వివరాలు తెలపాలని సుప్రీం కోర్టు తెలిపిన నేపథ్యంలో ఏకంగా 56 వేల పేజీలతో డిపాజిటర్ల వివరాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఏపీ ప్రభుత్వం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ప్రకారం ఈ కేసులో డిపాజిటర్ల వివరాలను తెలపాలని కోర్టు కోరడంతో దిగివచ్చిన రామోజీ రావు పూర్తిగా వివరాలను కోర్టు ముందుంచారు. గతంలో డిపాజిటర్ల పేర్లను, వివరాలను వెల్లడించడం కుదరదని చెప్పిన ఆయన ప్రస్తుతం తలొగ్గక తప్పలేదు. RAMOJI{#}Kumaar;ramoji rao;court;september;Lawyer;Qualification;Supreme Court;Undavalli;Andhra Pradesh;MP;Party;Telanganaఎట్టకేలకు.. రామోజీ దిగిరాక తప్పలేదా?ఎట్టకేలకు.. రామోజీ దిగిరాక తప్పలేదా?RAMOJI{#}Kumaar;ramoji rao;court;september;Lawyer;Qualification;Supreme Court;Undavalli;Andhra Pradesh;MP;Party;TelanganaSun, 23 Jul 2023 06:17:00 GMTమార్గదర్శి చిట్ పండ్ ఫైనాన్స్ కు సంబంధించిన కేసులో రామోజీ రావు దిగరాక తప్పలేదని తెలుస్తోంది. డిపాజిటర్ల వివరాలు తెలపాలని సుప్రీం కోర్టు తెలిపిన నేపథ్యంలో ఏకంగా 56 వేల పేజీలతో డిపాజిటర్ల వివరాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఏపీ ప్రభుత్వం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ప్రకారం ఈ కేసులో డిపాజిటర్ల వివరాలను తెలపాలని కోర్టు కోరడంతో దిగివచ్చిన రామోజీ రావు పూర్తిగా వివరాలను కోర్టు ముందుంచారు.


గతంలో డిపాజిటర్ల పేర్లను, వివరాలను వెల్లడించడం కుదరదని చెప్పిన ఆయన ప్రస్తుతం తలొగ్గక తప్పలేదు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి చిట్ ఫండ్ ఫైనాన్స్ లిమిటెడ్ పై దాఖలైన కేసులో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. దాదాపు 56 వేల పేజీల డిపాజిటిర్ల వివరాలను మార్గదర్శి గ్రూపు కోర్టుకు అందజేసింది.


ఏపీ ప్రభుత్వం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శిపై వేసిన పిటిషన్ లో ఏపీ ప్రభుత్వానికి అర్హత లేదని మార్గదర్శి తరఫు న్యాయవాది హరీశ్ సంఘ్వీ అన్నారు. అయితే దీన్ని ఏపీ తరఫున న్యాయవాది వైద్యనాథన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విబేధించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను పార్టీ చేసినట్లు ఉండవల్లి తెలిపారు. తెలంగాణ నుంచి ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.


ఏపీ నుంచి రీజాయిండర్ దాఖలు చేసినట్లు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ నుంచి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26 కు వాయిదా వేస్తున్నట్లు తీర్పునిచ్చింది. మార్గదర్శి అనేది తప్పుడు పంథాలో నడిపిస్తున్నట్లు ఉండవల్లి మొదటి నుంచి ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య వైరం విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉండవల్లి పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>