Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle35ec5bc3-e312-4e70-9b34-b2ea540484db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle35ec5bc3-e312-4e70-9b34-b2ea540484db-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు సినీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు.హీరోలకు తండ్రిగా,తాతగా కూడా నటించి మెప్పించాడు. అంతేకాకుండా కామెడీ, విలనిజం వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. ఐతే అడపాదడపా సినిమాలలో నటిస్తున్నా కానీ ఈ మధ్య ఆయన సినిమాల్లో నటించే ఓపిక లేదు.ఐతే ఆయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ socialstars lifestyle{#}Athadu;Fort;Father;Kannada;Telugu;Cinema;Chiranjeeviఅలా చేశాను అని చిరంజీవి నన్ను తిట్టాడు అంటున్న సీనియర్ నటుడు....!!అలా చేశాను అని చిరంజీవి నన్ను తిట్టాడు అంటున్న సీనియర్ నటుడు....!!socialstars lifestyle{#}Athadu;Fort;Father;Kannada;Telugu;Cinema;ChiranjeeviSun, 23 Jul 2023 16:56:25 GMTతెలుగు ప్రేక్షకులకు సినీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు.హీరోలకు తండ్రి గా,తాత గా కూడా నటించి మెప్పించాడు. అంతే కాకుండా కామెడీ, విలనిజం వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలం లో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. ఐతే అడపాదడపా సినిమా లలో నటిస్తున్నా కానీ ఈ మధ్య ఆయన సినిమా ల్లో నటించే ఓపిక లేదు.ఐతే ఆయన కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాష ల్లో వందల కొద్దీ సినిమా లలో నటించిన కోటా ఇప్పుడు వృద్ధాప్య సమస్య లతో బాధపడుతున్నారు. తాజా గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అప్పట్లో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భం గా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒకసారి షూటింగ్ సెట్‌ కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్‌ లేదని అన్నారు. అప్పుడు ఎమ్మెస్‌ నారాయణ ఏంటి అన్నాయ్‌, ఇంకా చాలా సమయం ఉంది గా అలా బయటకు వెళ్దాం అన్నాడు.అలా ఇద్దరు కలిసి బయటికి వెళ్లి మందు తాగాము. అనుకోకుండా షూటింగ్‌ కు రమ్మని కబురొచ్చింది.సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్‌ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి?పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యం గా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు అని చెప్పుకొచ్చాడు కోటా శ్రీనివాసరావు. ఏదేమైనా చిరంజీవి గారికి ఆయన కి ఉన్న సంబంధం గూర్చి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఆయన మెగాస్టార్ తో కలిసి చాలా సినిమాల్లో చేశారు.



RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>