Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-72842462-7598-44ab-81e6-1c2a569019df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-72842462-7598-44ab-81e6-1c2a569019df-415x250-IndiaHerald.jpgటెస్ట్ ఫార్మాట్ అంటే సుదీర్ఘమైన ఆటకు మారుపేరు. ఒకసారి క్రీజు లోకి వచ్చిన బ్యాట్స్మెన్లు పరుగులు చేయకున్నా పర్వాలేదు. కానీ క్రీజూలో పాతుకు పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిపించకపోయినా పర్వాలేదు. కానీ చివరికి డ్రాగా ముగిస్తే చాలు అనుకునేవారు ఒకప్పుడు. ఇలాంటి ఆట తీరే అటు టెస్ట్ ఫార్మాట్కు ఉన్న ఆదరణను క్రమక్రమంగా తగ్గేలా చేసింది. పరిమిత ఓవర్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు చెలరేగిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్ ను చూస్తూ సంబరపడిపోయే ప్రేక్షకులు. M టెస్ట్ ఫార్మాట్ ను పక్కన పెట్టడం మొCricket {#}Cricket;England;Sri Lanka;Dookuduఅతను.. టెస్ట్ క్రికెట్ కి కొత్త జీవం పోసాడు : సంగాకరఅతను.. టెస్ట్ క్రికెట్ కి కొత్త జీవం పోసాడు : సంగాకరCricket {#}Cricket;England;Sri Lanka;DookuduSun, 23 Jul 2023 07:50:00 GMTటెస్ట్ ఫార్మాట్ అంటే సుదీర్ఘమైన ఆటకు మారుపేరు. ఒకసారి క్రీజు లోకి వచ్చిన బ్యాట్స్మెన్లు పరుగులు చేయకున్నా పర్వాలేదు. కానీ క్రీజూలో పాతుకు పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిపించకపోయినా పర్వాలేదు. కానీ చివరికి డ్రాగా ముగిస్తే చాలు అనుకునేవారు ఒకప్పుడు. ఇలాంటి ఆట తీరే అటు టెస్ట్ ఫార్మాట్కు ఉన్న ఆదరణను క్రమక్రమంగా తగ్గేలా చేసింది. పరిమిత ఓవర్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు చెలరేగిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్ ను చూస్తూ సంబరపడిపోయే ప్రేక్షకులు. M టెస్ట్ ఫార్మాట్ ను పక్కన పెట్టడం మొదలుపెట్టారు.


 దీంతో సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ మనుగడ  దెబ్బతింటుందేమో అనుకుంటున్న సమయంలో.. ఇంగ్లాండ్ టెస్ట్ ఫార్మాట్ కి కొత్త జీవం పోసింది అని చెప్పాలి. ఏకంగా బజ్ బాల్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చి డ్రా చేయడం కోసం ప్రయత్నించడమే కాదు గెలుపు కోసం దూకుడుగా ఆడాలి అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ద్వారా టెస్ట్ క్రికెట్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికారు అని చెప్పాలి. అయితే కొంతమంది మాజీలు ఈ కొత్త విధానంపై విమర్శలు చేస్తే.. ఇంకొంతమంది మాత్రం ఇదే సరైనది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇంగ్లాండ్ హెడ్ కోచ్గా  మెకళ్లమ్ ఎంపికైన తర్వాత ఇక టెస్ట్ క్రికెట్లో ఇలాంటి మార్పుకు నాంది పలికారు.


 ఈ క్రమంలోనే శ్రీలంక లెజెండ్ కుమార సంగకర మేకళ్లమ్ పై ప్రశంసలు కురిపించారు. సంప్రదాయ పద్ధతిలో ఆడే ఇంగ్లాండ్ జట్టుకు  దూకుడు నేర్పి వారి ఆట తీరును సమూలంగా మార్చేశాడు మేకల్లమ్. అప్పటి వరకు వైట్ బాల్ కెప్టెన్ గా ఉన్న అతని అనుభవంతో ఎర్రబంతితో కొత్త ప్రయోగాలు చేశాడు. టెస్టులు అంటే సాగదీత ఆట కాదని నిరూపించాలని అనుకున్నాడు. అందుకు కొత్త రకం బజ్ బాల్ ఆటను పరిచయం చేసాడు. దాంతో సుదీర్ఘమైన ఫార్మాట్ ను మరోసారి ఎక్కువ మంది అభిమానులకు దగ్గర చేశాడు.. ఇలా టెస్టులకు కొత్త జీవం పోశాడు అంటూ సంగకర  వ్యాఖ్యానించాడు. టెస్టుల్లో వరుస ఓటములు చవిచూస్తూ.. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో హెడ్ కోచ్గా పదవి బాధ్యతలు చేపట్టాడు మేకళ్లమ్. ఇక ఒక ఏడాదిలోనే జట్టు ఆట తీరును పూర్తిగా మార్చేశాడు.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>