PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ukrain-war5e70ef61-25d6-41c9-ac51-bc992c468936-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ukrain-war5e70ef61-25d6-41c9-ac51-bc992c468936-415x250-IndiaHerald.jpgప్రపంచంలో అత్యధికంగా గోధుమలు పండే దేశాలు రష్యా, ఉక్రెయిన్ దేశాలు. దీంతో ఎక్కడి గోధుమలు అక్కడే గోడౌన్లలో ఉన్నాయి. పంటలు అలానే ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు లేవు. వివిధ దేశాల్లో సప్లై లేకపోవడంతో అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇజ్రాయిల్, టర్కీ, ఐక్యరాజ్య సమితి కలిపి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మాట్లాడారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనికి అంగీకరించారు. కానీ గోధుమలను అమ్మడానికి ప్రయత్నిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రష్యాUKRAIN WAR{#}Russia;Ukraine;war;Cheque;Europe countriesప్రపంచాన్ని నాశనం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్‌?ప్రపంచాన్ని నాశనం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్‌?UKRAIN WAR{#}Russia;Ukraine;war;Cheque;Europe countriesSun, 23 Jul 2023 05:43:00 GMTప్రపంచంలో అత్యధికంగా గోధుమలు పండే దేశాలు రష్యా, ఉక్రెయిన్ దేశాలు. దీంతో ఎక్కడి గోధుమలు అక్కడే గోడౌన్లలో ఉన్నాయి. పంటలు అలానే ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు లేవు. వివిధ దేశాల్లో సప్లై లేకపోవడంతో అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇజ్రాయిల్, టర్కీ, ఐక్యరాజ్య సమితి కలిపి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మాట్లాడారు.  


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనికి అంగీకరించారు. కానీ గోధుమలను అమ్మడానికి ప్రయత్నిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రష్యా దీనికి అంగీకరించడంతో పాటు తన వద్ద ఉన్న గోధుమలను కూడా అమ్మేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఆఫ్రికా దేశాలకు గోధుమలను పంపాలని చూస్తే సగానికి పైగా యూరప్ దేశాలకే వెళుతున్నాయి.


గోధుమలను అమ్మే వెహికల్స్ లోనే యూరప్ దేశాలు ఆయుధాలను కూడా ఉక్రెయిన్ కు పంపిస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపిస్తున్నారు. గోధుమలను ఆఫ్రికా దేశాలకు పంపిస్తే అక్రమ మార్గంలో యూరప్ దేశాలు వాటిని కొనుగోలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రెండు మూడు షిపులను చెక్ చేస్తే అందులో ఆయుధాలు దొరకడంతో రష్యా ఆ మధ్య గోధుమల సప్లై ని నిషేధించింది. సౌతాప్రికా అధ్యక్షుడు రంపోచిని రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరాలు అడిగారు. అయితే పంపుతున్న గోధుమలు మా వద్దకు వచ్చే సరికి షిప్ సగం కంటే ఎక్కువ ఖాళీ అయిపోతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పుతిన్ కు వివరించారు.


దీనికి పరిష్కారం చూపకుండా పంపించేది లేదని మళ్లీ వివాదం మొదటికొచ్చింది. పుతిన్, జెలెన్ స్కీలు ఒకరికంటే ఒకరు ఎక్కువగా పంతాలకు పోయి తమ దేశ భూభాగాలనే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై దెబ్బ కొడుతున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నది  ఆ రెండు దేశాల పై ఇన్ని రోజులుగా ఆధారపడి బతికిన ఆఫ్రికా, యూరప్ దేశాలు. యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే ప్రపంచ దేశాలకు అంత మంచిదంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>