DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-warcc7b07d0-e5dc-44f3-954a-95c2255b0cf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-warcc7b07d0-e5dc-44f3-954a-95c2255b0cf4-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని యూరప్ దేశాలు ఆకాశానికెత్తేశాయి. జెలెన్ స్కీ గొప్ప పోరాట యోధుడు ఆషామాషీ లీడర్ కాదు. ప్రపంచంలోనే బలవంతమైన దేశమైన రష్యాను ఢీకొంటూ తన దేశాన్ని కాపాడుతున్నడంటూ యూరప్ దేశాల పార్లమెంటులకు మరీ ఆహ్వానించి ఆయనతో ప్రసంగాలు ఇప్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా నాటో లో సభ్యత్వం ఇవ్వమంటే మాత్రం ఉక్రెయిన్ కు అవకాశం ఇవ్వడం లేదు. అసలు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైందే నాటో లో సభ్యత్వం ఇస్తామని అమెరికా, యూరప్ దేశాలు ఆశ చూపడం.. దానికి లొంగిన జెUKRAIN WAR{#}Leader;war;Russia;Ukraine;Europe countriesయుద్ధం: వాళ్లను నమ్ముకుని నిండా మునిగిన ఉక్రెయిన్?యుద్ధం: వాళ్లను నమ్ముకుని నిండా మునిగిన ఉక్రెయిన్?UKRAIN WAR{#}Leader;war;Russia;Ukraine;Europe countriesSun, 23 Jul 2023 11:00:00 GMTఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని యూరప్ దేశాలు ఆకాశానికెత్తేశాయి. జెలెన్ స్కీ గొప్ప పోరాట యోధుడు ఆషామాషీ లీడర్ కాదు. ప్రపంచంలోనే బలవంతమైన దేశమైన రష్యాను ఢీకొంటూ తన దేశాన్ని కాపాడుతున్నడంటూ యూరప్ దేశాల పార్లమెంటులకు మరీ ఆహ్వానించి ఆయనతో ప్రసంగాలు ఇప్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా నాటో లో సభ్యత్వం ఇవ్వమంటే మాత్రం ఉక్రెయిన్ కు అవకాశం ఇవ్వడం లేదు.


అసలు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైందే నాటో లో సభ్యత్వం ఇస్తామని అమెరికా, యూరప్ దేశాలు ఆశ చూపడం.. దానికి లొంగిన జెలెన్ స్కీ నాటోలో చేరితే తమను రష్యా ఏమీచేయదనే భావనలో ఉండడం, అనంతరం అమెరికాతో కలిసి పయనించడం, వద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించడం.. తదనంతర పరిణామాలతో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికీ 500 రోజులు దాటిపోయింది. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.


ఉక్రెయిన్ కు కొద్దొ, గొప్పో ఆయుధాలు సరఫరా చేస్తూ అండగా ఉంటున్నామని చెబుతున్నా యూరప్ దేశాలు ఇక ముఖం చాటేసే ప్రయత్నాలు మొదలెట్టాయి.  ఈ మధ్య నాటో దేశాలకు సంబంధించిన సమావేశం జరిగితే అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు మా దేశాన్ని నాటోలో ఎప్పుడు చేర్చుకుంటారని ప్రశ్నించారు. దీనికి యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ దాటవేత వైఖరిని అవలంభించాయి. దీంతో ఆయనకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.


ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడిని బ్రిస్సెల్స్ లో జరిగిన సమావేశానికి పిలవలేదు. మళ్లీ ఎక్కడ నాటో లో చేర్చుకోమని అడుగతాడోనని యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించి జరిగిన సమావేశానికి ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందించలేదు. ఇలా మెల్లి మెల్లిగా ఉక్రెయిన్ ను పక్కన బెడుతున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మరింత ముదిరితే యూరప్ దేశాలను నమ్ముకున్న జెలెన్ స్కీకి మొండి చేయి ఎదురుకాక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధానికి ముగింపు పలికి శాంతి చర్చలకు ప్రయత్నించాలి.



RRR Telugu Movie Review Rating

"సూర్య సన్నాఫ్ కృష్ణన్" రీ రిలీజ్ ఆ తేదీనే... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>