HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/ginger-teab31c007a-4c43-453b-9d71-696ee6d48a8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/ginger-teab31c007a-4c43-453b-9d71-696ee6d48a8a-415x250-IndiaHerald.jpgవర్షాకాలం మొదలైంది అంటే చాలు ఈ చలికి వేడివేడిగా ఏదో ఒకటి తాగాలని,తినాలని అనిపిస్తూ ఉంటుంది. మరియు ఈ సీజన్ లోనే ఎన్నో రోగాలు మనల్ని చుట్టూముడుతూ ఉంటాయి.ఆ రోగాలను తగ్గించుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా అంతే ఎఫెక్ట్ గా పని చేయాలి.అటువంటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అల్లం టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక రోజు అల్లం టీ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో మనము తెలుసుకుందామా.. అల్లం టీ తయారు చేసుకునే విధానం.. అల్లం టీ తయారు చేGINGER TEA{#}Ginger;Jaggery;Cholesterol;Shaktiఅల్లం టీ తాగడంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?అల్లం టీ తాగడంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?GINGER TEA{#}Ginger;Jaggery;Cholesterol;ShaktiSat, 22 Jul 2023 06:00:00 GMTవర్షాకాలం మొదలైంది అంటే చాలు ఈ చలికి వేడివేడిగా ఏదో ఒకటి తాగాలని,తినాలని అనిపిస్తూ ఉంటుంది. మరియు ఈ సీజన్ లోనే ఎన్నో రోగాలు మనల్ని చుట్టూముడుతూ ఉంటాయి.ఆ రోగాలను తగ్గించుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా అంతే ఎఫెక్ట్ గా పని చేయాలి.అటువంటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అల్లం టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక రోజు అల్లం టీ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో మనము తెలుసుకుందామా..

అల్లం టీ తయారు చేసుకునే విధానం..

అల్లం టీ తయారు చేసేందుకు ముందుగా గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు,ఒక గ్లాస్ నీరు,ఒక గ్లాసు పాలు వేసి బాగా మరిగించాలి.ఇందులో తీయదనం కోసం బెల్లం కానీ,తేనే కానీ వాడుకుంటే చాలా మంచిది.

రోజు అల్లం టీ తాగడం వల్ల ఇందులో మ్యాంగనీస్, మెగ్నీషియం,కాపర్,జింక్,విటమిన్ b6, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.దీనితో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా,పొట్ట నొప్పి,కీళ్ల వాపులు,కీళ్ల నొప్పులు తొందరగా తగ్గుముఖం పడతాయి.

వర్షం మొదలైంది అంటే చాలు చాలామందికి దగ్గు, జలుబు,జ్వరంతో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారికి రోజుకో కప్పు అల్లం టీ ఇవ్వడం వల్ల,అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వారి రోగనిరోధక శక్తిని పెంచి,వైరల్ మరియు బ్యాక్టీరియల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

అంతేకాక ఇప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగి,ఆరోగ్యానికి ఎంతో హాని కలుగచేస్తోంది.సాధారణంగా అల్లంకు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచె గుణం ఉంటుంది.కావున అలాంటి వారికి పచ్చి అల్లం లేదా అల్లం నీరు,అల్లం టీ ఇవ్వడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.అధిక బరువు,ఊబకాయం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

అలాగే దీర్ఘకాలిక రోగమైన క్యాన్సర్‌కు విరుగుడుగా కూడా అల్లం బాగా పనిచేస్తుంది.ఇందులో కొలొరెక్టర్, లివర్ క్యాన్సర్లపై పోరాడే గుణాలు పుష్కళంగా లభిస్తాయి.దీంతో రోజూ అల్లం టీ తీసుకోవడంతో చాలా రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చు. కావున ప్రతి ఒక్కరు రోజుకు ఒక కప్పు అల్లం టీ తాగడం చాలా ఉత్తమం.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారంలో రాజకీయం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>