Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl4176b3c8-431e-48d1-87ff-f24d3505f09b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl4176b3c8-431e-48d1-87ff-f24d3505f09b-415x250-IndiaHerald.jpgసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే ఒకప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని పిలుచుకునేవారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అదే సన్రైజర్స్ పేరు వినిపిస్తే చాలు ఓ ఆ టీమా ఎలాగో ఓడిపోతుంది కదా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సీజన్లో అంతటి దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది సన్రైజర్స్. అయితే కోచింగ్ సిబ్బందిని ఎన్నిసార్లు మార్చిన.. అటు జట్టు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదే సమయంలో ఇక జట్టును ప్రక్షాళన చేసి ప్లేయర్లను మార్చి కొత్త కెప్టెన్ నియమించిన కూడా సన్రైజర్స్ ఫేట్ మాత్రం మారడం లేదు. 2023 Ipl{#}Legend;Punjab;March;Hyderabad;Cricketసన్రైజర్స్ హెడ్ కోచ్ గా టీమిండియా లెజెండ్.. ఇక దబిడి దిబిడేనా?సన్రైజర్స్ హెడ్ కోచ్ గా టీమిండియా లెజెండ్.. ఇక దబిడి దిబిడేనా?Ipl{#}Legend;Punjab;March;Hyderabad;CricketSat, 22 Jul 2023 19:15:00 GMTసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే ఒకప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని పిలుచుకునేవారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అదే సన్రైజర్స్ పేరు వినిపిస్తే చాలు ఓ ఆ టీమా ఎలాగో ఓడిపోతుంది కదా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సీజన్లో అంతటి దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది సన్రైజర్స్. అయితే కోచింగ్ సిబ్బందిని ఎన్నిసార్లు మార్చిన.. అటు జట్టు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదే సమయంలో ఇక జట్టును ప్రక్షాళన చేసి ప్లేయర్లను మార్చి కొత్త కెప్టెన్ నియమించిన కూడా సన్రైజర్స్ ఫేట్ మాత్రం మారడం లేదు.


 2023 ఐపీఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ మార్కరమ్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ మరోసారి వరుస వైఫల్యాలతో నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కోసం మరోసారి జట్టును ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ బ్రియాన్ లారా పై వేటు వేయబోతున్నట్లు సమాచారం. అతని నేతృత్వంలో సన్రైజర్స్ జట్టు 2023 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది  పాయింట్లు పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.


 అయితే మరోవైపు విండీస్ జట్టును చక్కదిద్దే బాధ్యతలను కూడా లారా తీసుకోవడంతో.. ఇక ఐపీఎల్ వైపు అతను మొగ్గు చూపే అవకాశం తక్కువగానే ఉంది   దీంతో హెడ్ కోచ్ గా మరొక నిపుణుడిని తీసుకురావాలని భావిస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో లెజెండ్ గా కొనసాగుతున్న మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఖచ్చితంగా వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ కి కొత్త హెడ్ కోచ్గా తీసుకువచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది  ఇప్పటికే దీనికోసం వీరేంద్ర సెహ్వాగ్ ను సంప్రదించారట. ఇక అతడి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారట. గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్ కి మెంటార్ గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. అంతేకాదు ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. దీంతో అతని హెడ్ కోచ్ గా నియమించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తుందట.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>